AP : రూ. 1425 కోట్ల పెట్టుబడులు, 2,500 ఉద్యోగాలు

AP Govt Latest News: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ కు వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.610 కోట్ల పెట్టుబడితో రోజుకు 500 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ తయారీ చేయనున్నారు. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64వేల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్, 4వేల టన్నుల డ్రైడ్‌ డిస్టిలరీ గ్రెయిన్స్‌ ఉత్పత్తి కానుంది. మరోవైపు విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్‌ కూడా… సర్వేపల్లిలో ఇథనాల్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కర్మాగార పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.315 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. రోజుకు 200 కిలోలీటర్ల బయోఇథనాల్‌ తయారీ కానుంది. ఇక తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటిల్‌ కాఫీ లిమిటెడ్‌ పుడ్‌ మరియు బెవెరేజెస్‌ కంపెనీ ఏర్పాటు చేయనుండగా…. వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.400 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు కానుండగా… రూ.100 కోట్ల పెట్టుబడి, 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ కంపెనీ పనులను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు.

Source link