AP BJP Vice President Vishnuvardhan Reddy took responsibility for making PM Modi’s meeting a success in Nanded | Maharastra Elections: మహారాష్ట్రలో ఊపందుకుంటున్న ప్రచారం

Maharastra Elections AP BJP Vice President Vishnuvardhan Reddy: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీజేపీ నేతలు ప్రణాళికా బద్దంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ బహిరంసభలు నిర్వహిస్తున్నారు.                             

నాందేడ్ జిల్లాలో తొమ్మిదో తేదీన ప్రధాని మోదీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాందేడ్ జిల్లాకు  బీజేపీ పరిశీలకునిగా ఆంధ్రప్రదేశ్ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ప్పటి నుండి విష్ణువర్ధన్ రెడ్డి నాందేడ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంతో పాటు ప్రచార వ్యూహాలు, ఎలక్షనీరింగ్ వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేసే భాధ్యతను కూడా తీసుకున్నారు. భారీగా జన సమీకరణ చేసి.. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఉన్న పాజిటివ్ వాతావరణాన్ని ప్రస్పుఠం చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.

నాందేడ్ జిల్లాలో తెలుగువారి ప్రభావం ఉంటుదంి. అలాగే బీజేపీ కూడా అక్కడ బలంగానే ఉంటుంది.వ్యూహాత్మంగా జన సమీకరణ చేస్తే ఐదారు లక్షల మంది సులువుగా వచ్చే అవకాశం ఉంది.ఈ దిశగా విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ నేతలతో జస  సమీకరణ వ్యూహాలపై చర్చిస్తున్నారు. 

నాందెడ్ జిల్లాలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా నేతలంతా పని చేస్తున్నారు. మరోసారి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విష్ణువర్ధన్  రెడ్డి  ధీమా వ్యక్తం చేస్తున్నారు.         మరో ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నాసిక్ ప్రాంతానికి పరిశీలనిగా వెళ్లారు. నాసిక్ లో కూడా తెలుగు వారు ఉంటారు. షిరిడికి వెళ్లే భక్తులు  దగ్గరలో ఉన్న నాసిక్ కు కూడా వెళ్తూంటారు. జ్యోతిర్లింగ క్షేత్రం ప్రసిద్ధి చెందినది. టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టు ఉంది. ఈ సారి ఎన్నికల్లో మరోసారి అక్కడ బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రయత్నంలో పరిశీలనకునిగా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెళ్లారు.  

ఇక బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్న మథుకర్ ను మరఠ్వాడా ప్రాంతానికి పరిశీలకునిగా నియమించారు. పరిశీలకుని విధులు బీజేపీలో కీలకంగా ఉంటాయి. క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయడం మాత్రమే కాకుండా.. ప్రచార సరళిని సమన్వయం చేయడం, అభ్యర్థికి పార్టీకి మధ్య సమన్వయం చేయడం, ఓటర్లను నేరుగా కలిసే బృందాలకు దిశానిర్దేశం  చేయడం వంటివి చేస్తూంటారు. అభ్యర్థుల విజయంలో పరిశీలకుల విధులు కీలకంగా ఉంటాయని భావిస్తారు. 

                       

 

మరిన్ని చూడండి

Source link