AP CEO MK Meena Going To Delhi Due To EC Calls Him   | MK Meena: ఏపీలో ఓట్ల గల్లంతు ఫిర్యాదులు

MK Meena: ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిచింది. సీఈసీ పిలుపుతో ఆయన ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో భారీగా ఓట్లు గల్లంతు అయ్యాయని విపక్షాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనను సీఈసీ ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, స్థానిక యంత్రాంగం ఇష్టారీతిన ఓట్లు రేచ్చడం, తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలు పార్టీల నేతలు, స్వచ్చంధ సంస్థలు పిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ముఖేశ్ కుమార్ మీనాను ఢిల్లీకి పిలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వచ్చేటప్పుడు ఏపీ ఓటర్ల జాబితాతో పాటు ముఖ్యమైన ఫైళ్లను కూడా వెంట తీసుకు రావాలని కూడా చెప్పినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరగనుందో.  

Source link