ap deputy cm pawan kalyan visits tamilnadu madurai temples history of Arulmigu Solaimalai Murugan Temple Pazhamudircholai | Pawan kalyan: అరుల్మిగు సోలైమలై మురుగన్ సేవలో పవన్ కళ్యాణ్

Arulmigu Solaimalai Murugan Temple Pazhamudircholai: దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు (శనివారం) మదురైలో అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయ విశేషాలు మీకోసం..
 
షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా ఫిబ్రవరి 15 శనివారం ఉదయం తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా అళగర్  కొండల్లో కొలువైన పలముదిర్చోలై అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని సందర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్.  గారు దర్శించుకున్నారు. 

ఆలయ అధికారులు, అర్చకులు పూలమాలలు, శాలువాతో సత్కరించి పూర్ణకుంభంతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు.  ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా మురుగన్ కు ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం  ఈ క్షేత్ర విశిష్టతను ఆలయ అర్చకులు వివరించి.. తీర్థప్రసాదాలు అందించారు. 

Also Read: చారిత్రక మీనాక్షి ఆలయంలో ఉన్న శ్రీ చక్రం గురించి మీకు తెలియని రహస్యం – ఇది తెలుసుకోవడమే జన్మ ధన్యం!

ఆలయంలో కంద షష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో  భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. పవన్ తో పాటూ తనయుడు అకీరా నందన్ ,  టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ ఆనంద్ సాయి కూడా స్వామివారిని దర్శించుకున్నాడు. 
 
మురుగన్ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా  ఇప్పటివరకు 5 సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు దర్శించుకున్నామని..ఈ రోజు సాయంత్రం తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర సందర్శనతో  షణ్ముఖ యాత్ర పూర్తవుతుందని చెప్పారు.

Also Read: పవన్ కళ్యాణ్ వెళ్లిన స్వామిమలై విశిష్టత ఏంటి – ఈ ఆలయానికి చేరుకోవడం ఇంత సులభమా!

అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయ చరిత్ర-విశిష్టత ఏంటో తెలుసా.. 

పజముదిర్చోలై 13వ శతాబ్దంలో పాండ్య రాజుల కాలంలో నిర్మించారని చెబుతారు. తమిళనాడు ప్రాంతానికి సంరక్షకుడిగా మురుగన్ ని భావిస్తారు తమిళ ప్రజలు. అందుకే అత్యంత భక్తిశ్రద్ధలతో కుమారస్వామిని పూజిస్తారు.

సోలైమలై ఆలయ సముదాయంలో విశాలమైన ప్రదేశంలో  వివిధ దేవతల మందిరాలుంటాయి. ఆలయ ప్రధాన దైవం మురుగన్.. 12 చేతులతో, వివిధ ఆయుధాలు ధరించి ఆరు ముఖాలతో షణ్ముఖుడు దర్శనమిస్తాడు. స్కంద షష్టి లాంటి ప్రత్యేకరోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఊరేగింపులు, సాంస్కృతి కార్యక్రమాలు కన్నులపండువగా సాగుతాయి.

సోలైమలై ఆలయం ఉన్న  పజముదిర్చోలై కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు..ప్రకృతి అందాలతో కూడిన అందమైన ప్రదేశం కూడా. ప్రసిద్ధ తమిళ కవి నక్కీరార్మ్ తన తమిళ కవిత తిరుమురుకాత్రుప్పడైలో సోలైమలై గురించి అత్యద్భుతంగా వివరించారు. ఇది ఆరుపదైవీడులలో చివరిది అయినప్పటికీ సందర్శకుల పరంగా ఎక్కువ మందిని ఆకర్షించే సుబ్రహ్మణ్య క్షేత్రం ఇది.  ఎందుకంటే దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక అన్వేషకులకు, ప్రకృతి ప్రేమికులను మైమరపించేలా ఉంటుంది. అందుకే నిత్యం భక్తుల రద్దీ సాగుతూనే ఉంటుంది. 

Also Read: ఔషధ మొక్కల రసాయనాలతో అభిషేకం, మూలికా ప్రసాదం – పవన్ దర్శించుకున్న అగస్త్య మహర్షి ఆలయానికి దారి ఇదే!

మరిన్ని చూడండి

Source link