AP DSC 2024 Updates : ఏపీ డీఎస్సీ పరీక్షలపై(AP DSC 2024) క్లారిటీ ఇచ్చింది ఏపీ విద్యాశాఖ. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఇవాళ్టి(మార్చి 30) నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో…. పరీక్షల నిర్వహణ కోసం ఈసీకి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం. కానీ ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవటంతో….. మరోసారి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఓ ప్రకటన విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన తరువాతే డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం కొత్త షెడ్యూల్ ను ప్రకటిస్తామని స్పష్టం చేసింది. సెంటర్ల ఎంపిక ఆప్షన్లు కూడా ఈసీ అనుమతి వచ్చిన తర్వాతే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.