ByGanesh
Tue 04th Feb 2025 09:42 PM
గత రెండు రోజులుగా తండేల్ టికెట్ రేట్స్ హైక్ పై చాలా చర్చ నడుస్తుంది. ఏపీలో టికెట్ రేటు పెరుగుతుంది ఓకె, కానీ తెలంగాణాలో టికెట్ రేట్స్ పెరిగే ఛాన్స్ కనిపించడం లేదు, మరోపక్క తెలంగాణాలో ఇకపై బెన్ ఫిట్ షోస్ కి ఛాన్స్ లేదని రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం తండేల్ మేకర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.
ఏపీలో తండేల్ సినిమా టికెట్ రేట్లు పెంపుకు అనుమతి.
సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 50 పెంపు.
మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ.75 పెంపు.
సినిమా రిలీజైన వారం రోజులు వరకు ఈ ధరలు కొనసాగుతాయి అని జీ ఓ జారీ చేసింది.
AP good news for Thandel:
Thandel Ticket Hike In AP