AP Govt : ఆర్ 5 జోన్ ఇళ్లపై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్

AP Govt Latest News: అమరావతి పరిధిలోని ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ… న్యాయపోరాటానికి సిద్ధమైంది ఏపీ సర్కార్. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని అత్యున్నత న్యాయస్థానం స్వీకరించగా… ఈ పిటిషన్ శుక్రవారం లేదా ఆ తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Source link