స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
అప్రెంటిస్‌షిప్ ట్రైనీ పోస్టుల భర్తీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్ తదితర విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీలను తీసుకోనుంది. మొత్తం 250 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. అకడమిక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. జులై 31 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఎంపికైన వారికి స్టైపెండ్ లకు రూ.8,000 నుంచి రూ.9,000గా చెల్లిస్తారు. www.vizagsteel.com వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.