AP Medical Seats: తెలంగాణలో 2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో ఓపెన్ కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో కూడా కొత్త మెడికల్ కాలేజీలకు అవే నిబంధనలు వర్తింప చేయనున్నారు. దీంతో తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఏపీలో సీట్లు కేటాయించరు.