గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, నందివాడ, గుడ్డవల్లేరు, పెదపారుపూడి మండలాల్లో ఖాళీగా ఉన్న 49 రేషన్ దుకాణాలకు డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుడివాడ ఆర్డీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. వీటిలో గన్నవరం మండలంలో 14, బాపులపాడు మండలంలో 11, ఉంగుటూరు మండలంలో 9, నందివాడ మండలంలో 8, గుడ్డవల్లేరు మండలంలో 3, పెదపారుపూడి మండలంలో 4 రేషన్ డీలర్ల పోస్టులు భర్తీ చేస్తున్నారు.