AP Tourism : ఏపీ పర్యాటక రంగంలో మరో అద్భుతం జరగబోతోంది. ఇందుకు బెజవాడ వేదిక కానుంది. విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 9న పున్నమిఘాట్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. త్వరలో రెగ్యులర్ సర్వీస్ నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు.