Concern About DeepSeek’s Privacy Policy: చైనీస్ ఏఐ మోడల్ డీప్‌సీక్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్లలో డౌన్లోడ్స్ పరంగా ఇది అగ్రస్థానంలో ఉంది, ఓపెన్ఏఐ (OpenAI)కి చెందిన AI మోడల్ ఛాట్‌జీపీటీ (ChatGPT)కి బలమైన పోటీ ఇస్తోంది. డీప్‌సీక్‌లో ఉన్న అతి పెద్ద ఫీచర్.. ఇది అందరికీ “ఉచితం”. ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నప్పటికీ, డీప్‌సీక్ గోప్యత విధానం (DeepSeek Privacy Policy)పై సందేహాలు తలెత్తుతున్నాయి.
మీ సమాచారం చైనా చేతికి!
డీప్‌సీక్, తన యూజర్ల పేరు, ఫోన్ నంబర్, పాస్వర్డ్ & పుట్టిన తేదీ వంటి ప్రొఫైల్ సమాచారాన్ని ఎక్కడ నిల్వ చేస్తుందో మీకు తెలుసా? డీప్‌సీక్ FAQ (తరచూ అడిగే ప్రశ్నలు – సమాధానాలు) పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇది, యూజర్ IP అడ్రెస్, పేమెంట్ డిటైల్స్, వినియోగిస్తున్న పరికరం ID, కుకీలు, AI చాట్బాట్లతో సంభాషణలను ట్రాక్ చేస్తుంది. అంతేకాదు, డీప్‌సీక్ మీ కార్యకలాపాలను ఆన్లైన్లో ట్రాక్ చేయడానికి కుక్కీలు & వెబ్ బీకన్లను ఉపయోగిస్తుంది.
డీప్‌సీక్ ద్వారా మీ పరికరం మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్ గురించిన సమాచారం చైనా (CHINA) చేతికి అందుతోంది. యాప్‌లోని వినియోగదారుల డేటా చైనీస్ సర్వర్లలో నిల్వ చేస్తున్నారు. డీప్‌సీక్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, యూజర్ నుంచి సేకరించిన వ్యక్తిగత సమాచారం మొత్తం ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’లో ఉన్న సురక్షిత సర్వర్లలో నిల్వ చేస్తున్నారు.
డీప్సీక్కి యూజర్లలో విపరీతమైన క్రేజ్
డీప్సీక్కి భారతదేశంలో ఎంత ఆదరణ లభిస్తుందనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు, కానీ అమెరికాలో దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. అంటే అమెరికన్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని చైనా సర్వర్లకు అందజేస్తున్నారు. చైనీస్ యాప్ టిక్‌టాక్ (TikTok)ను 2020లో మన దేశంలో నిషేధించిన విషయం మీకు తెలిసిందే. వినియోగదార్ల వ్యక్తిగత వివరాల భద్రత & గోప్యతకు ముప్పు ఉన్న దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. డీప్‌సీక్ విషయంలోనూ ఇప్పుడే అవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా సైన్యంలో నిషేధం
వ్యక్తిగత వివరాల గోప్యతపై ఆందోళనలు తలెత్తిన కారణంగా, అమెరికా సైనికులు డీప్‌సీక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకుండా & వినియోగించకుండా అగ్రరాజ్యం నిషేధం విధించింది.
డీప్‌సీక్ అంటే ఏమిటి?
Hangzhou ఆధారిత డీప్‌సీక్ 2023 నుంచి AI మోడల్‌పై పని చేస్తోంది. లియన్ వెన్ఫెంగ్ ఈ సంస్థకు పునాదిని వేశారు. కృత్రిమ మేధ చాట్బాట్లలో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టడంతో పాటు ChatGPTకి పోటీగా ఇది ప్రారంభమైందని సమాచారం. ఇది, ఇతర అమెరికన్ కంపెనీల కంటే చౌకగా ఉంటుంది & డేటాపై ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, డీప్‌సీక్ మోడళ్లను అభివృద్ధి చేయడానికి కేవలం 6 మిలియన్ డాలర్లు సరిపోయింది. అయితే, అమెరికన్ టెక్ కంపెనీలు AI కోసం ఇంతకంటే ఎన్నో ఎక్కువ రెట్ల డబ్బు ఖర్చు చేశాయి. డీప్‌సీక్‌లో ప్రస్తుతం రెండు మోడల్‌లు ఉన్నాయి – R1 & R1 జీరో. ప్రస్తుతం, వినియోగదారులు R1 మోడల్‌ను మాత్రమే ఉపయోగించగలరు.
మరో ఆసక్తికర కథనం: ఎల్ఈడీ బల్బ్ Vs ట్యూబ్ లైట్: ఏది మీ కరెంట్ బిల్లును తగ్గిస్తుంది?
మరిన్ని చూడండి