Ashok Leyland: కృష్ణా జిల్లా మల్లవల్లి అశోక్ లేలాండ్ బస్సుల తయారీ ప్లాంటును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత మల్లవల్లిలో అశోక్ లేలాండ్ సంస్థ ప్లాంటును నిర్మించినా ఆ తర్వాతి కాలంలో అది ప్రారంభం కాలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్లాంటు కార్యకలాపాలు మొదలయ్యాయి.