Atul Subhash sacrifice of life is awakening the male race of the country Menstoo | Mentoo: దేశవ్యాప్తంగా #Mentoo ట్రెండింగ్ – మగజాతిని కదిలించిన ఓ వ్యక్తి ప్రాణత్యాగం

Atul Subhash sacrifice of life is awakening the male race of the country Mentoo:  మీ టూ అనే ఓ ఉద్యమం నడుస్తూ ఉంటుంది. పాతికేళ్లు, ముఫ్పై ఏళ్ల కిందట ఓ మగ వ్యక్తి తనను వేధించాడని మహిళ ఆరోపిస్తే వెంటనే కేసులు పెట్టేస్తారు. నిజానిజాలు ఎవరికీ తెలియవు. అదే సమయంలో కుటుంబ వివాదాల్లో గృహహింస చట్టాలు ఒక్క మహిళలకు మాత్రమే సెక్యూరిటీని కల్పిస్తాయి. మరి మగవాళ్ల సంగతేమిటి? చట్టాల విషయంలో తమకు ఉన్న స్వేచ్చను దుర్వినియోగం చేస్తూ మగవాళ్లను వేధిస్తున్న వారికి ఎలాంటి శిక్షల్లేవు.కానీ ఆ బాధల కారణంగా మగవాళ్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోంది. తాజాగా అతుల్ సుభాష్ అనే టెకీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖలో ఇవే అంశాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి అన్ని వ్యవస్థల అధిపతులకు పంపారు. ఇప్పుడీ అంశం దేశంలోని మగవాళ్లందరికీ సంబంధించినదిగా మారింది. 

భార్య వేధింపుల  కారణంగా అతుల్ సుభాష్ ఆత్మహత్య 

బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసే అతుల్ సుభాష్ అనే వ్యక్తికి పెళ్లి అయింది. కానీ భార్యతో సరిపడలేదు. ఆమె అతుల్ సుభాష్‌పై కేసులు పెట్టింది. అసహజమైన శృంగారం, కట్నం కోసం వేధింపులు అంటూ అనేక రకాల కేసులు పెట్టింది. పోలీసులు నిజానిజాలు నిర్దారణ చేయకుండా కేసులు పెట్టారు. తన తప్పు లేకపోయినా తనను వేధించాలన్న కారణంతోనే భార్య కేసులు పెట్టింది. తన వాదన ఎన్ని సార్లు వినిపించుకున్నా చట్టంలో ఆ వెసులుబాటు లేదని ఇలాంటి విషయాల్లో మగవాడే నిందితుడు అని తేల్చేశారు. దాంతో ఆవేదనకు గురి అయిన అతుల్ సుభాష్ అన్ని వివరాలు సమగ్రంగా లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకున్నారు. 

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అతుల్ సుభాష్ ఆత్మహత్య

అతుల్ సుభాష ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. మగవాళ్లు ఎదుర్కొంటున్న ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్ని సుభాష్ ప్రాణత్యాగం వెలుగులోకి తెచ్చింది. చట్టాలు దుర్వినియోగం చేసి మగవాళ్లను వేధిస్తున్న భార్యల గురించి ఎన్నో సార్లు కథనాలు వచ్చినా.. నిజాలు బయటపడినా..తప్పుడు కేసులని తెలిసినా మగవాళ్లనే బాధితులుగా చేస్తున్న వైనంపై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. 



మెన్‌టూ ఉద్యమం ప్రారంభం

సోషల్ మీడియాలో  మగ జాతికి ఇప్పుడు మహిళల నుంచి రక్షణ కావాలన్న నినాదంతో మెన్ టు వివాదం ప్రారంభమయింది. మహిళలు మాత్రమే మనుషులు కాదని ..  మగవాళ్లు కూడా మనుషులేనని వారు వేధింపులకు గురి అయితే ఎవరు రక్షిస్తారని.. చట్టాలన్నీ సమానంగా ఉండాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వాయిస్ అంతకంతకూ పెరుగుతోంది. 

 

అందరూ సమానమే.. మహిళలకు వేధించే హక్కు లేదు !

మన సమాజంలో అందరూ సమానమేనని చెబుతారు. అందుకే ఎవరికీ వేధించే హ క్కు లేదు. మగవాళ్లు వేధిస్తే ఎలాంటి చట్టాలతో కేసులు పెడితారో ఆడవాళ్లు వేధించినా కూడా అలాంటి కేసులో పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతి ఒక్క పురుషుతూ అతుల్ సుభాష్ ప్రాణ త్యాగానికి సరైన విలువఇచ్చే విదంగా వాయిస్ రైజ్ చేస్తే.. మిగిలిన మగవాళ్లకు అయినా కాస్త  భరోసా లభిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

మరిన్ని చూడండి

Source link