Audience waiting for Devara దేవర కోసం వెయిటింగ్ అంటున్న ఆడియన్స్


Mon 04th Nov 2024 09:58 AM

devara  దేవర కోసం వెయిటింగ్ అంటున్న ఆడియన్స్


Audience waiting for Devara దేవర కోసం వెయిటింగ్ అంటున్న ఆడియన్స్

ఈమధ్యన థియేటర్స్ లో ఎలాంటి సినిమా అయినా వీక్షించేందుకు ఫ్యామిలీ ప్రేక్షకులు బద్ధకించేస్తున్నారు. హిట్ సినిమా అయినా, ప్లాప్ సినిమా అయినా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చెయ్యడం ప్రధాన కారణమైతే, పిల్లలను తీసుకుని థియేటర్ కి వెళ్లి సినిమా చూసి పాప్ కార్న్ ఇప్పించి డబ్బులు వదిలించుకోవడమెందుకు అదేదో ఓటీటీలో వచ్ఛాక హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని సినిమా చూసేయ్యొచ్చు అనేది వాళ్ళ వాదన. 

సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో విడుదలైన దేవర చిత్రాన్ని థియేటర్స్ లో చూడని వారు, చూడలేకపోయిన వారు, బద్దకించినవారు.. దేవర ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. థియేటర్స్ లో విడుదలై నెల పైనే అంటే ఐదు వారాలయ్యింది,  అదేమిటి ఇంకా దేవర ఓటీటీ డేట్ నెట్ ఫ్లిక్స్ ప్రకటించలేదు అంటూ మాట్లాడుకుంటున్నారు. 

మరి  దేవర పాన్ ఇండియా లాంగ్వజెస్ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పుడే ఎనిమిది వారాల గ్యాప్ తో ఓటీటీ లో స్ట్రీమింగ్ కి తెచ్చేలా మేకర్స్ ఒప్పందం చేసుకున్నారన్నారు. కానీ కొన్ని సినిమాలు ఆ ఒప్పందాలను బ్రేక్ కూడా చేస్తున్నాయి. మరి దేవర నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అదేదో అధికారికంగా చెబితే బావుంటుంది. 


Audience waiting for Devara:

Audience waiting for Devara ott release





Source link