Australian Prime Minister Anthony Albanese Falls Off Stage at election campaign in New South Wales

Australian PM Anthony Albanese:న్యూ సౌత్ వేల్స్‌లో గురువారం జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ  అల్బనీస్ కిందపడిపోయారు. మే నెలలో ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనంతరం మీడియా కోసం ఫొటోలకు ఫోజులు ఇస్తున్న టైంలో ఈ ఘటన జరిగింది. 

వేదికపై నడుచుకుంటూ వెళ్తున్న టైంలో అల్బనీస్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఒక్కసారిగా అలా పడిపోవడం చూసి అంతా షాక్ అయ్యారు. ఏం జరిగిందో అని కంగారు పడ్డారు. 

పడిన తర్వాత ఆయనలేచి అందరిని నవ్వుతూ పలకరించారు. తనకు ఏం కాలేదని చెప్పారు. రెండు చేతులు ఊపుతూ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. స్థానిక ఓ రేడియో ఛానల్‌తో మాట్లాడుతూ… తాను వేదికపై పడిపోలేదని. కాలు మాత్రం తడబడిందని తెలిపారు. తూలినట్టు చెప్పుకొచ్చారు. తనకు ఏం కాలేదని ఆరోగ్యంగా ఉన్నానని వివరించారు.  

మే 3న జరిగే ఎన్నికల ప్రచారంలో అల్బనీస్ బిజీ
ఆస్ట్రేలియాలో మే 3 ఎన్నికలు జరగనున్నాయి. అందుకు ఇప్పటికే నుంచే పీటర్ డట్టన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ లిబరల్-నేషనల్, లేబర్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అందులో భాగంగా ప్రధానమంత్రి అల్బనీస్ అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ లేబర్ పార్టీ అధికారంలో ఉంది. 

మరిన్ని చూడండి

Source link