Maha kumbha Mela 2025:
అంచనాలకు మించిన భక్తజనం కుంభమేళాకు పోటెత్తుతున్నారు. 2025 కుంభమేళాకు 40 కోట్లమంది భక్తులు వస్తారని అంచనా వేస్తే.. ఇప్పటికే 53 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా కుంభమేళా ముగిసేందుకు తొమ్మిది రోజులు టైముంది. ముగింపు రోజు దగ్గరపడేకొద్దీ భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముగింపు తేదీని పొడిగిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది..దీనిపై ఇప్పటికే అధికారులు క్లారిటీ ఇచ్చేశారు..
Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం – శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!
మహా కుంభమేళాలో చేసే రాజస్నానాల్లో ఒక్కటే పెండింగ్ ఉంది. అదే ఫిబ్రవరి 26 ఆఖరి రోజు, అదే రోజు మహాశివరాత్రి కావడంతో ఈ రోజు భక్తుల రద్దీని ఆపడం సాధారణ విషయం కాదు. వాస్తవానికి కుంభమేళా ప్రారంభమైన రోజునుంచీ భక్తుల వరద సాగుతోంది. త్రివేణి సంగంమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పోటీపడుతున్నారు. జనవరి 13 భోగి రోజు ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రికి 45 రోజులు పూర్తిచేసుకుంటుంది. ఆ రోజే ఆఖరి రోజు. ఈ తేదీ పొడిగిస్తారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆ ప్రచారానికి చెక్ పెట్టేశారు అధికారులు. ముందుగా చెప్పిన తేదీల ప్రకారం 45 రోజులకే మహా కుంభమేళా పూర్తవుతుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే కుంభమేళాలో వరుస అగ్నిప్రమాదాలు జరిగాయి. మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువై తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందారు. వరుస ఘటనలు చూసి రద్దీని నియంత్రించేందుకు కుంభమేళా ముగింపు తేదీని పొడిగిస్తారనే ప్రచారం జరిగింది. అయితే అనుకున్న ప్రకారమే మహా శివరాత్రితో కుంభమేళా ముగుస్తుందని తేల్చి చెప్పేశారు అధికారులు.
Also Read: ఒకటి ‘మహా శ్మశానం’ , మరొకటి ‘మనో శ్మశానం’ – ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
మహా కుంభమేళా ముగింపు తేదీ దగ్గరపడేకొద్దీ భారీగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తున్నారు. సాధారణంగా అమృత స్నానాల సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అమృత స్నానాలు ముగిసినా కానీ అదే రద్దీ సాగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాగరాజ్ చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. స్నాన ఘట్టాల దగ్గర తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివెళుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే, RTC అధికారులు మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మచిలీపట్నం, గుంటూరు, కాకినాడ టౌన్, విజయవాడ, మౌలాలీ, చర్లపల్లి, వికారాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ముగింపు తేదీలో మార్పు లేదనే స్పష్టతతో ఆఖరివారం రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది…
Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు – మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!
మరిన్ని చూడండి