Ayodhya Ram Mandir Inauguration Railways Changes Train Schedules For Ayodhya

Ram Mandir Opening:

అయోధ్యకి ఎక్కువ రైళ్లు..

అయోధ్య ఉత్సవానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటోంది ఇండియన్ రైల్వేస్. డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతుండడం వల్ల రైళ్ల వేళల్లోనూ మార్పులు చేస్తోంది. డిమాండ్‌కి తగ్గట్టుగా రైల్ సర్వీస్‌లను నడపడంతో పాటు ఎక్కువగా ఆలస్యం లేకుండా వాటిని షెడ్యూల్ చేసింది. కేంద్రమంత్రి దర్శన జర్దోష్ ఈ మేరకు ఓ అఫీషియల్ లిస్ట్ విడుదల చేశారు. ఇందులో ట్రైన్ టైమింగ్స్ వివరాలు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ షెడ్యూల్‌ని పోస్ట్ చేశారు. సూరత్‌లోని ఉధ్నా స్టేషన్ నుంచి అయోధ్యకి జనవరి 30న ఓ ట్రైన్‌ అందుబాటులో ఉంది. ఆ తరవాత ఫిబ్రవరి 10వ తేదీన ఇండోర్ నుంచి అయోధ్యకి స్పెషల్ ట్రైన్‌ షెడ్యూల్ చేశారు. వడోదర, పలన్‌పూర్, వల్సాద్, సబర్మతి నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఏ ట్రైన్ ఏ రోజు బయల్దేరుతుందో షెడ్యూల్‌లో వెల్లడించారు. 

Source link