ByGanesh
Thu 03rd Apr 2025 12:32 PM
నందమూరి నటసింహం బాలకృష్ణ వరస హిట్స్‌తో సీనియర్ హీరోలకే కాదు,యంగ్ హీరోలకు సైతం ఛాలెంజ్ విసురుతున్నారు. డాకు మహారాజ్ హిట్ తర్వాత తన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చిత్ర షూటింగ్‌లో బిజీగా వున్నారు. ఒకవైపు ఏపీ అసెంబ్లీ, మరో వైపు సినిమా షూటింగ్స్ అంటూ బాలయ్య పరుగులు పెడుతున్నారు.
తాజాగా బాలయ్య ఓ పాన్ ఇండియా ఫిల్మ్‌లో గెస్ట్ రోల్ వస్తే రిజెక్ట్ చేశారనే వార్త వైరల్ అయ్యింది. అది గోపీచంద్ మలినేని హిందీలో తెరకెక్కిస్తున్న జాట్ చిత్రంలో బాలయ్యను గెస్ట్ రోల్ చేయించడానికి గోపీచంద్ ట్రై చేశారట, కానీ బాలయ్య మాత్రం ఆ ఆఫర్‌ని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
జాట్ చిత్ర ట్రైలర్ చూశాక ఈ కథ బాలకృష్ణకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, గోపీచంద్ మలినేని బాలయ్యకు మరో హిట్ ఇచ్చేవారు అని అందరూ మాట్లాడుకున్నారు. గతంలో గోపీచంద్-బాలయ్య కాంబోలో వీర సింహారెడ్డి చిత్రం వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
Balakrishna Rejects Guest Role in Pan-India Film:
Nandamuri Balakrishna Turns Down Cameo Offer in Gopichand Malineni Jaat