Balochistan problem: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో రైలు హైజాక్ అంశం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ ప్రాంత వాసులు చాలా కాలంగా వేర్పాటు కోరుతున్నారు. అయితే వారిని పాకిస్తాన్ పాలకులు పాశవికంగా అణిచివేస్తున్నారు. దీతో తమ ప్రాంత విముక్తి కోసం వారు పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్‌లో బలూచిస్తానే అతిపెద్ద ప్రావిన్సు. పాకిస్తాన్ దేశం అవతరించి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ఆ ప్రాంతం సమస్యాత్మకంగానే ఉంది. పాకిస్తాన్‌లో తమను బలవంతంగా, చట్టవిరుద్ధంగా కలిపారన్నది చాలా మంది బలూచిస్తాన్ ప్రజల భావన. 1948లో ఈ సమస్య మొదలైంది. బ్రిటీష్ పాలకులు వెళ్లిపోయాక బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ కూడా దీనికి సమ్మతి తెలిపింది. కానీ, ఆ తర్వాత మాట మార్చింది. బలవంతంగా తమలో కలుపుకుంది.
తమ ప్రాంత స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 1970లో ప్రారంభమయింది. 2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అణచివేత అధికారం కావడంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఆత్మాహుతి దాడులు కూడా మొదలయ్యాయి. వాటిని సంస్థ ‘ఫిదాయీ దాడులు’గా చెప్పుకుంటుంది. 2018 నవంబర్‌లో కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై జరిగిన మిలిటెంట్ దాడికి కూడా తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్ హైజాక్ చేసిది.
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో దాదాపు 44 ఉటుంది. బలూచ్ ప్రజలు చాలా కాలంగా పాకిస్తాన్ నుండి విడిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా చేయాలని వారు కోరుతున్నారు. పాకిస్తాన్ తమతో ఎప్పుడూ వివక్ష చూపిందని వారు ఆరోపిస్తున్నారు.
బలూచ్ ప్రజలకు ప్రత్యేక సంస్కృతి కూడా ఉంది, ఇది వారిని పాకిస్తాన్లోని మిగిలిన ప్రాంతాల నుండి వేరు చేస్తుంది. బలూచ్ ప్రజల సంస్కృతి వారిని ఇరాన్లోని సిస్తాన్ ప్రావిన్స్‌లో సరిహద్దులు దాటి నివసించే ప్రజలకు దగ్గర చేస్తుంది. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతం ఇరాన్, ఆధునిక పాకిస్తాన్ మధ్య ఉండేది.
బలూచిస్తాన్ పాకిస్తాన్‌కు చాలా ముఖ్యమైనది. ఇది పాకిస్తాన్ ఆదాయానికి ప్రధాన వనరులలో ఒకటి, అయినా ఇప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో గ్యాస్, యురేనియం, బంగారం, రాగి, ఇతర లోహాల భారీ నిల్వలు ఉన్నాయి. ఇక్కడి గ్యాస్ నిల్వలు సగం పాకిస్తాన్ అవసరాలు తీరుతున్నాయి. మధ్య ఆసియాలోకి ప్రవేశించడానికి చైనా నిర్మించిన గ్వాదర్ పోర్ట్ ఇక్కడే ఉంది. ఇరాన్-పాకిస్తాన్ గ్యాస్ పైప్‌లైన్ కూడా ఈ ప్రాంతం గుండానే వెళుతుంది. . బలూచిస్థాన్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ చైనా ఆధిపత్యం ఉంటుంది. అక్కడి ప్రజలపై నిర్బంధాలకు పాల్పడుతూ ఉంటుంది. ఇది కూడా బలూచ్ వివాదానికి ఆజ్యం పోస్తోంది. ఇటీవల కొొన్ని ఉగ్రవాద బృందాలతో చైనా ఒప్పందాలు చేసుకుంది.
అయితే బలూచిస్తాన్ లో ఉగ్రవాద సమస్యకు భారత్ ను నిందిస్తూ ఉంటుంది పాకిస్తాన్. అక్కడి ప్రజలు కూడా తమ కు స్వాతంత్రం కల్పించేందుకు భారత్ సహకరించాలని కోరుతూంటారు. కానీ ఇప్పటి వరకూ భారత్ జోక్యం చేసుకోలేదు.
మరిన్ని చూడండి