bangalore youth caught flashing swords in public for reals video goes viral | Bangalore Viral video News: కత్తులతో బైక్స్‌పై స్టంట్స్‌ వీడియో వైరల్- కేసు నమోదు

Bangalore Latest News: బెంగళూరులో అసలే ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను కొందరు కుర్రాళ్లు భయభ్రాంతులకు గురి చేశారు. వాడి కలిగిన కత్తులతో డేంజరస్‌ స్టంట్స్‌ చేస్తూ అందర్నీ ఆందోళనకు గురి చేశారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుడంతో పోలీసులు పదకొండు మంది కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. 

డీజే హళ్లీ, రామమూర్తి నగర్ ప్రాంతంలో పోకిరీలు టూవీలర్స్‌పై  వెళ్తూ కత్తులు తిప్పుతూ వెళ్లే వాళ్లను ఇబ్బందులకు గురి చేశారు. వాళ్లు చేస్తున్న ప్రమాదకర స్టంట్స్‌ను, భయభ్రాంతులకు గురి అవుతున్న ప్రజలను కెమెరాలో కొందరు రికార్డు చేశారు. వాటిని సోషల్ మీడియోలో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారడంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. 

రోడ్డుపై ప్రజలను ఇబ్బంది పెట్టేలా డేంజరస్ స్టంట్స్ చేసిన నయీం, అరాఫత్, సాహిల్, నన్జామత్‌, అద్నామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను విచారిస్తే రీల్స్ కోసం ఇలాంటి విన్యాసాలు చేసినట్టు తేలింది. వాళ్లు ఇచ్చిన సమాచారంతో మిగతా వారిని అరెస్టు చేశారు. ఇప్పుడు పోలీసుల అదుపులో 11 మంది ఉన్నారు. 

ఇప్పుడు ఈ వీడియో రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ వీడియోను సోషల్ మీడియా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నిలదీస్తోంది. ముఖ్యంగా హోమంత్రి పరమేశ్వర్‌ను ప్రశ్నిస్తోంది. యాక్సిటెండల్‌ మినిస్టర్‌గా అభివర్ణిస్తూ ప్రశ్నలు సంధించింది. ఇప్పుడు దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటని అడుగుతోంది. ఈసారి ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారని క్వశ్చన్ చేసింది. వాళ్లు మానసిక పరివర్తన లేని వాళ్లని చెబుతారా? లేకుంటే ఏదో అనుకోకుండా అలా జరిగిందని కప్పిపుచ్చుతారా అంటూ సెటైర్లు వేస్తోంది. 

అంతే కాకుండా రాహుల్ గాంధీని కూడా ట్యాగ్ చేసి అప్పట్లో చెప్పిన మొహబత్‌కా దుకాణ్‌ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తోంది. రాహుల్ గాంధీని బాలక్ బుద్దీగా అభివర్ణిస్తూ సెటైర్ పోస్టు చేసింది కర్ణాటక బీజేపీ.

Also Read: ట్రైనర్‌తో ప్రేమ – ఆత్మహత్య చేసుకున్న డాల్ఫిన్ – ఇది కథ కాదు రియల్ స్టోరీ !

మరిన్ని చూడండి

Source link