ByGanesh
Fri 29th Mar 2024 12:00 PM
బర్రెలక్క ఉరఫ్ కర్రే శిరీష్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. గత తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అందరి చూపు తనవైపు తిప్పుకున్న బర్రెల్లక్క ఇప్పుడు వెంకటేష్ అనే యువకుడిని నిన్న మార్చ్ 28 న పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పీఎంఆర్ గార్డెన్ లో బర్రెలక్క వెడ్స్ వెంకటేష్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
సోషల్ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కర్రే శిరీష్.. ఎన్నికల్లో నిలబడడం హాట్ టాపిక్ అయ్యింది. పెద్దవాళ్ళతో పోటీపడి ఎన్నికల ప్రచారం చేసింది. కానీ ఐదువేల ఓట్ల తేడా తో ఆమె ఓడిపోయింది. ఆ ఆతర్వాత ఆమె MP గా పోటీ చేస్తుంది అనుకుంటే పెళ్లి చేసుకుంటున్నట్లుగా చెప్పి షాకిచ్చింది.
మార్చ్ 28 న జరిగిన బర్రెలక్క వివాహానికి బంతుమిత్రులతొ పాటు పలువురు ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్ళికి కొద్దిరోజుల ముందు తన వివాహంపై బర్రెలక్క సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్స్ తో పంచుకుంది. ప్రీవెడ్డింగ్ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.. ఇప్పుడు తాజాగా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Barrelakka aka Sirisha ties knot in Nagarkurnool:
Barrelakka Sirisha Gets Married To Venkatesh