Bengaluru Company Looking for Chief Dating officer should have one break up situationships and 3 dates | Viral News: ఆటగాళ్లకు, బ్రేకప్ అయినవాళ్లకు జాబ్‌ ఆఫర్‌

Viral News: కంపెనీ తమ ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వారి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ నిశితంగా పరిశీలిస్తుంది. ఏ చిన్న అనుమానం వచ్చిన వారిని రిజెక్ట్ చేస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా వారి క్యారెక్టర్‌ను మరింత గమనిస్తుంది. అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం వినూత్నమైన వ్యక్తులను ఉద్యోగంలో పెట్టుకునేందుకు చూస్తోంది. ఇప్పటి వరకు అలాంటి వ్యక్తులు దొరకలేదట. 

బెంగళూరుకు చెందిన ఓ డేటింగ్ కంపెనీ చీఫ్‌ డేటింగ్ ఆఫీసర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వేసింది. సోషల్ మీడియాలో ఆ సంస్థ ఇచ్చిన ప్రకటన చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఇలాంటి క్వాలిఫికేషన్స్ కూడా చూస్తారా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఆ ఉద్యోగ ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది. 

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వాళ్లకు కచ్చితంగా బ్రేకప్‌ స్టోరీలు ఉండాలట. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రేమకథలు గురించి తెలిసి ఉండాలి. డేటింగ్ యాప్స్‌ పరిచయం ఉండాలి. రెండు మూడు యాప్స్‌లో సభ్యత్వం కూడా ఉండాలి. ఉద్యోగం పేరుకు తగ్గట్టుగానే అర్హతలు కూడా చాలా తేడాగానే ఉన్నాయి. 

బెంగళూరుకు చెందిన మెంటరింగ్ , కన్సల్టింగ్ ప్లాట్‌ఫామ్ అయిన టాప్‌మేట్ ఈ విచిత్రమైన ఉద్యోగం కోసం అభ్యర్థిని వెతుకుతోంది. ప్రేమ, లవ్‌ బ్రేకప్‌,ఆన్‌లైన్ డేటింగ్ మోసాల జమానాలో నిజాయితీగల వ్యక్తి కోసం ఫ్లడ్‌లైట్‌వేసి మరీ వెతుకుతోంది.  

ఆన్‌లైన్‌లో ఆ సంస్థ ఇచ్చిన ప్రకటన ప్రకారం…” “మేము చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కోసం వెతుకుతున్నాం. డేటింగ్ సలహాలు ఇచ్చే మంచి స్నేహితుడు మీరైతే… డేటింగ్ సంస్కృతి తెలిసిన వారు, దానిలో జీవించే వ్యక్తికి ఈ జాబ్‌లో నియమిస్తాం. “ghosting,” “breadcrumbing” ఇలా ప్రతి కొత్త డేటింగ్ బజ్‌వర్డ్‌ను డీకోడ్ చేయగల స్వయం ప్రకటిత మ్యాచ్‌మేకర్ మీరా? మీలాంటి వారి కోసమే మేం ఎదురు చూస్తున్నాం” అని టాప్‌మేట్‌లో మార్కెటింగ్ లీడ్ నిమిషా చందా రాశారు.

ఈ చీఫ్‌ డేటింగ్ ఆఫీసర్ కోసం ఆ కంపెనీ పెట్టిన రూల్స్ చూస్తే మాత్రం బుర్ర తిరుగుతుంది. “1. ఒక బ్రేకప్‌ ఎక్స్‌పీరియన్స్ కచ్చితంగా ఉండాలి. రెండు  సిచ్యుయేషన్ షిప్‌లు, మూడు డేట్స్‌ తప్పనిసరి( రుజువులు అడగరు కానీ అవి ఎలా సాగాయో చెప్పాల్సి ఉంటుంది.) 2.⁠ కొత్తగా వస్తున్న డేటింగ్ యాప్స్‌ గురించి తెలియాలి. వాటికి భిన్నంగా కొత్తది క్రియేట్‌ చేసే దమ్ము ఉండాలి. 3. రెండు మూడు డేటింగ్ యాప్స్ ట్రై చేసి ఉండాలి(అందులో అనుభూతులను అడుగుతాం, మోసం చేయడానికి వీలు లేదు.)” అని ఆ పోస్టులో వివరించారు. 

ఈ ప్రకటనకు తగ్గట్టుగానే నెటిజన్లు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ఓ అమ్మాయితో లవ్‌లో ఉండేవాడిని… చివరి బెంచ్‌లో కూర్చొని FLAMES ఆడుకున్నామని రాశాడు. ఆ స్టోరీతో నేను ఎలిజిబుల్ అవుతానా అని రాసుకొచ్చాడు.  

సిచ్యుయేషన్ షిప్‌నకు మిలీనియల్స్ చాలా పాతవారైపోయారని వాళ్లు జెన్‌జీల కోసమే చూస్తున్నారని మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు.  
ఇంకో వ్యక్తి అయితే మరింత ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. పైన చెప్పిన అర్హతలు ఏవీ తనకు లేవని తనకు డేటింగ్ అనుభవం లేదని, మాజీ లవర్స్ కూడా లేరని డేటింగ్ యాప్ ప్రొఫైల్ కూడా లేదని చెప్పాడు. తాను ప్రయోగశాలలో ఎలుక లాంటి వాడినని తనతో ప్రయోగాలు చేయాలని సూచించాడు. ఇంటర్న్‌గా తీసుకొని విచ్చలవిడిగా వాడుకోవాలని కంపెనీకి ఆఫర్ ఇచ్చాడు.  

మరిన్ని చూడండి

Source link