Bengaluru Housing Society Bizarre Rules For Maids Not To Use Common Areas Parks Residents Welfare Association Circular

Bengaluru Housing Society: 

బెంగళూరులోని అసోసియేషన్‌లో రూల్..

బెంగళూరులోని ఓ వెల్ఫేర్ అసోసియేషన్‌లో పని మనుషులపై వింత ఆంక్షలు పెట్టారు. పార్క్‌లు, లాన్‌లలో తిరగొద్దని తేల్చి చెప్పారు. వెయిటింగ్ ఏరియాల్లో మాత్రమే కనిపించాలని నిబంధన విధించారు. కామన్ ఏరియాల్లో పని మనుషులు ఉండటం వల్ల రెసిడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని, సెక్యూరిటీకి కూడా సమస్యలొస్తున్నాయని ఆ అసోసియేషన్ వెల్లడించింది. “వంట మనుషులు, కార్పెంటర్‌లు, ప్లంబర్‌లు..ఇలా చాలా మంది వచ్చి రెసిప్షన్‌లోని సోఫాల్లో కూర్చుంటున్నారు. మా రెసిడెంట్స్‌ అంతా సోఫాల్లో కూర్చోడం ఎప్పుడో మానేశాం” అని చెప్పింది. 

నోటీస్‌లో ఏముందంటే..

“పని మనుషులందరూ అసోసియేషన్‌లోని అన్ని బిల్డింగ్‌ల్లో ఉన్న వెయిటింగ్ రూమ్‌లో మాత్రమే ఉండాలి. పని మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలన్నా, భోజనం చేయాలన్నా అన్నీ ఇక్కడే. మీరు విశ్రాంతి తీసుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ కామన్ ఏరియాల్లో మీరు కనిపించడం వల్ల రెసిడెంట్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సెక్యూరిటీ కూడా సరైన విధంగా మానిటర్ చేయలేకపోతోంది”

ఈ నోటీస్‌ని సోషల్ మీడియాలో ఎవరో షేర్ చేశారు. అప్పటి నుంచి ఆ అసోసియేషన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ఫస్ట్ మూడు లైన్స్‌ చదివాక నాకు ఇందులో కాంట్రవర్సీ ఏం కనిపించలేదు. ఆ తరవాత మొత్తం చదివాక అర్థమైంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “వాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని వాళ్లు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు” అంటూ మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. “అదే పని మనుషులు మీ ఇంట్లో తిరుగుతున్నారు. మీకు వంట చేసి పెడుతున్నారు. అంట్లు కడుగుతున్నారు. అదంతా తప్పు కానప్పుడు కామన్ ఏరియాల్లో కనిపించడం మాత్రం ఎలా తప్పవుతుంది..? ఇది చాలా దారుణం” అని మరొకరు కామెంట్ చేశారు. 

Source link