PVR INOX: మధ్యాహ్నం పన్నెండు గంటలకు సినిమా అని టిక్కెట్ బుక్ చేసుకుంటాం. ఠంచన్ గా వెళ్లి కూర్చుకుంటాం. కానీ అసలు సినిమా పన్నెండున్నరకు ప్రారంభమవుతుంది. అంటే అరగంట సేపు ప్రకటనలు వేస్తారు. మళ్లీ ఇంటర్వెల్ లో ప్రకటనలు వేస్తారు. రెండున్నర గంటల సినిమా కదా అని దానికి తగ్గట్లు టైమ్ షెడ్యూల్ చేసుకుని వెళ్తే.. ఆ ప్రకటనలు చూపించేందుకు మన టైం అరగంట వేస్ట్ చేస్తారు. ఇలా ఓ వ్యక్తి టైమ్ ఈజ్ మనీ అనుకుని తన మనీని వేస్ట్ చేశారని న్యాయపోరాటం చేశాడు. అతని వాదనలో నిజం ఉందని చెప్పిన కోర్టు అతనికి లక్ష కట్టాలని తీర్పు ఇచ్చింది.
బెంగళూరులో నివాసం ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తి విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ అనే సినిమాకు వెళ్లాుడు. సామ్ బహదూర్ షో సాయంత్రం 4:05 అని పీవీఆర్ ఐనాక్స్ మెసెజ్ చేసింది. సినిమా సాయంత్రం 6:30 కి ముగిసిపోతుందని.. తర్వాత తాను డ్యూటీకి వెళ్లవచ్చని అనుకున్నాడు. కానీ సుదీర్ఘ ప్రకటనలతో ఆయన టైం టేబుల్ తప్పింది. తన సమయాన్ని వృధా చేసినందుకు PVR సినిమాస్, బుక్‌మైషో , INOX లపై అభిషేక్ కేసు పెట్టాడు. చెప్పిన సమయం కన్నా అరగంట ఆలస్యంగా సినిమా ప్రారంభించారని తన సమయాన్ని వృధా చేశారని వినియోగదారులకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ రోజుల్లో టైమ్ ఈజ్ మనీ అని తన సమయాన్ని వృధా చేసి, డబ్బు దోపిడీ చేసే హక్కు లేదని వాదించారు. అభిషేక్ వాదనతో జిల్లా వినియోగదారుల ఫోరం ఏకీభవించింది. బిజీగా ఉన్న వ్యక్తులకు థియేటర్‌లో 25-30 నిమిషాలు అనవసరమైన ప్రకటనలు చూడటం కష్టమని స్పష్టం చేసింది. జిల్లా వినియోగదారుల ఫోరం PVR , INOX లు వినియోగదారుకు ను మానసిక వేదన కలిగించాయని, అసౌకర్యానికి గురి చేశాయని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుని రూ. 20,000 అలాగే చట్టపరమైన ఖర్చుల కింద 8,000 చెల్లించాలని ఆదేశించింది. అధిక ప్రకటనలు వేసినందుకు అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది.
ప్రజా సేవా ప్రకటనలను ప్రదర్శించడం తప్పనిసరి అని సినిమా థియేటర్లు వాదించాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన విధంగా, ముఖ్యమైన సామాజిక సమస్యల గురించి అవగాహన పెంచడానికి థియేటర్లు చట్టబద్ధంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పాయి. అయితే ఆ కారణంతో ఇతర ప్రకటనలు ప్రదర్శించి సమయం వృధా చేయడం మంచిదికాదని తెలిపింది. అంతే కాదు.. సినిమా టిక్కెట్ పై అసలు ప్రదర్శన సమయాన్ని .. అంటే సినిమా ప్రారంభించే సమయాన్ని పేర్కొనాలని ఆదేశించింది.
ఇప్పుడు మల్టిప్లక్స్ లో సినిమాకు వెళ్లి అరంగట పాటు యాడ్స్ టార్చర్ అనుభవించిన వారంతా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి బెంగళూరు కోర్టు తీర్పు ను చూపిస్తే.. మల్టిప్లెక్స్ అందరికీ పరిహారం చెల్లించాల్సి రావచ్చు.
Also Read: బిఎస్‌ఎన్‌ఎల్‌కు టైం వచ్చింది! 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా లాభాలు
మరిన్ని చూడండి