Bengaluru woman shows huge price difference on Zepto for Android and iPhone users Watch | Bengaluru: బిల్డప్ కోసం ఐ ఫోన్లు కొంటే ఇంతే

Bengaluru woman shows huge price difference on Zepto for Android and iPhone users:  ఐ ఫోన్లు ఎవరు కొంటారు ?.  ఓనెలకు యాభై వేల రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా కొనలేడు. నెలకు లక్ష సంపాదించిన వ్యక్తి కొనవచ్చు కానీ.. ఓ నెలజీతం కేటాయించాల్సిందే. అంత కేటాయించి కొనేది ఎందుకు ?. కేవలం బిల్డప్ కోసమే అనుకోవచ్చు. ఎక్కువ మంది  హోదా కోసం ఐ ఫోన్లు కొంటారు. ఇలాంటి వారిని అలాంటి హోదాతోనే కొట్టాలని జెప్టో వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆన్ లైన్ లో రేట్లను ఐ ఫోన్‌లో ఓ రకంగా.. ఆండ్రాయిడ్  ఫోన్లలో ఓ రకంగా సెట్ చేస్తున్నారు. సహజంగా ఐ ఫోన్‌లో అత్యధిక రేట్లను పెడుతున్నారు. ఈ తేడాను బెంగళూరుకు చెందిన ఓ మహిళ చూసి రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టింది. 

పూజా అనే మహిళకు రెండు ఫోన్లు ఉన్నాయి. ఒకటి ఆండ్రాయిడ్, రెండోది ఐ ఫోన్. రెండింటిలోనూ జెప్టో యాప్ ఉంది. ఇంటికి అవసరమైన సరుకుల్ని పది నిమిషాల్లో డెలివరీ చేసే జెప్టో ఇటీవలి కాలంలో  బాగా ఆదరణ పొందింది. ఈ క్రమంలో ఆమె ఓ రోజు క్యాప్సికమ్ కొనుగోలు చేయాలని ప్రయత్నించారు. మొదట ఆండ్రాయిడ్ ఫోన్‌లో చూశారు. తర్వాత ఐ ఫోన్ లో చూశారు. అయితే అక్కడా ఇక్కడా రేట్లు తేడాగా ఉండటం గమనించారు. రూపాయి రెండు రూపాయలు కాదు ఏకంగా రెట్టింపు ఉన్నాయి. దీంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. 


పూజా బ యట పెట్టిన వివరాల ప్రకారం చూస్తే ..  జెప్టో ఐ ఫోన్ యూజర్లకు అత్యధిక రేట్లను పెడుతోంది. అంటే ఐ ఫోన్ వాడేవాళ్లు వేరే కేటగిరీ అని వాళ్లుక ఎక్కువ రేట్లు పెట్టినా త్‌ప్పు లేదని అనుకుంటోంది. అదే ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్లను కొనుగోలు శక్తి తక్కువగా ఉండే వాళ్లని వాళ్లకు నార్మల్ రేట్స్.. డిస్కౌంటెడ్ ప్రైసెస్ పెడితే బిజినెస్ పెరుగుతుందని అనుకోవచ్చు. ఇలాంటి తేడాలను.. ఫోన్లు వాడే వారిని బట్టి చూపించడంతో నెటిజన్లు భిన్నంగా రియాక్టవుతున్నారు. 

అండ్రాయిడ్ ఫోన్లలో యాప్ లు.. ఐ ఫోన్‌లో యాప్‌లు వేర్వేరుగా ఉండాయి. ఆండ్రాయిడ్ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. అదే ఐ ఫోన్ యూజర్లకు మాత్రం ప్లే స్టోర్ సపోర్టు చేయదు. ప్రత్యేకంగా యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. అక్కడా ఇక్కడా వేర్వేరుగా ప్రోగ్రామింగ్ చేయాల్సిఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని.. జెప్టో సంస్థ ఐ ఫోన్ యూజర్లను బిల్డప్ గాళ్లగా భావించి..  రేట్లు ఎక్కువ పెట్టినా కొనుగోలు చేస్తారన్న ఉద్దేశంతో ఎక్కువ ధరలను పెడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై జెప్టో ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. 

Also Read : Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం – ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే విలువైన ఆస్తి నష్టం

మరిన్ని చూడండి

Source link