Bhagavanth Kesari Song Shoot In RFC భారీ సెట్ లో బాలయ్య-కాజల్-శ్రీలీలపై సాంగ్


Mon 31st Jul 2023 12:12 PM

bhagavanth kesari  భారీ సెట్ లో బాలయ్య-కాజల్-శ్రీలీలపై సాంగ్


Bhagavanth Kesari Song Shoot In RFC భారీ సెట్ లో బాలయ్య-కాజల్-శ్రీలీలపై సాంగ్

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ భగవంత్ కేసరి. ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైయ్యే భారీ అంచనాల సినిమాలలో ఒకటి. ప్రస్తుతం భగవంత్ కేసరి షూటింగ్ హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సిలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కీలక నటులంతా కనిపించబోయే ఈ పాటను బిగ్ స్క్రీన్స్ పై చూడటం కన్నుల పండువగా ఉంటుంది.

భగవంత్ కేసరి యునిక్ కాన్సెప్ట్‌ తో హై యాక్షన్‌ గా వుంటుంది. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి  ప్రజంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది.  

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన విలన్‌గా కనిపించనున్నారు.  

దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.


Bhagavanth Kesari Song Shoot In RFC:

Bhagavanth Kesari Song Shoot On Balakrishna, Kajal, and Sreeleela In A Massive Set In RFC





Source link