Bill Gates enjoying time with his serious girlfriend Paula Hurd: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, అపర కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ కంపెనీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం కలసి జీవించిన సతీమణి మిలిందా గేట్స్ తో విడిపోయారు. ఇప్పుడు ఆయన తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 69 ఏళ్ల వయసులో పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు బిల్ గేట్స్. కొన్నేళ్ల కింద భార్యకు విడాకులు ఇచ్చిన ఆయన.. ఓ మహిళతో లవ్ స్టోరీ ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఈ కారణంగానే వారి సుదీర్ఘ వివాహ బంధం ముగిసిపోయిందన్న ప్రచారం ఉంది. ఆ ప్రచారంలో నిజం ఎంత ఉదో కానీ.. ఇప్పుడు ఆయన తన గర్ల్ ఫ్రెండ్ గురించి మొదటి సారి బయట పెట్టడం వైరల్ గా మారింది. ఆయన గర్ల్ ఫ్రెండ్ పేరు పాలా హర్డ్. ఆమెనే తన సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అని రివీల్ చేశారు. ‘ఆమె లాంటి వ్యక్తి దొరకడం నిజంగా నా అదృష్టం. మేమిద్దరం కలసి టోర్నమెంట్స్‌కు వెళ్తుంటాం. మేం కలసి పనులు కూడా చేసుకుంటాం’ అని ఆయన ఓ ఇంటర్యూలో వివరాలు వెల్లడించారు.
994లో మెలిందా ఫ్రెంచ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్. ఆమెతో 27 ఏళ్ల పాటు కలసి ఉన్నారు. అయితే ఊహించని విధంగా విడాకులు తీసుకుని విడిపోయారు. పాలా హర్డ్‌తో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పాలా హర్డ్ ఎవరో కాదు ఒరాకిల్ సంస్థ సీఈవో మార్క్ హర్డ్ సతీమణి అయిన పాలా హర్డ్‌కు ఇప్పుడు 62 ఏళ్లు. భర్త మార్క్ హర్డ్ 2019లో చనిపోవడంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నారు పాలా హర్డ్. ఎక్కడ పరిచయం అయిందో కానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2023 జనవరి నెలలో వీళ్లిద్దరూ కలసి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జంటగా సందడి చేయడంతో వీళ్లు రిలేషన్‌లో ఉన్నారనే రూమర్స్ మరింత పెరిగాయి. ఆమే తన సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అని ఎట్టకేలకు బిల్ గేట్స్ కన్ఫర్మ్ చేయడంతో ఇప్పుడు అంతా నిజమయింది.
మరో వైపు బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా కూడా తన కొత్త భాయ్ ప్రెండ్ ను వెదుక్కుకున్నారు. ఫిలిప్ వాఘన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. ఆయన కూడా టెక్ పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్నారు.
Also Read: ఇన్‌ఫోసిస్, ఎల్ అండ్ టీ పెద్దలనుకుంటే వాళ్ల తాత ఎలాన్ మస్క్ – వారానికి 120 గంటలు పని చేయాలట !
మరిన్ని చూడండి