BJP MLA Gauri Shankar Bisen Misbehavior With Students Video Goes Viral Check Details

BJP MLA Gauri Shanker: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గౌరీ శంకర్ బిసేన్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆయన బడి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరు బాలికలను తన వద్దకు లాక్కొని ఫొటో దిగారు. కూర్చుని ఉన్న వారిని లేపి మరీ వారి భుజాలపై చేతులు వేసుకుని చాలా దగ్గరకు తీసుకున్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. వెంటనే వైరల్ గా మారింది. జూన్ 22వ తేదీ 10.50 నిమిషాలకు వీడియోను పోస్ట్ చేయగా… 160.7కే వ్యూస్ వచ్చాయి. అలాగే వేలల్లో లైకులు వందల్లో కామెంట్లు వచ్చాయి. ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు బీజేపీ నేతల నుంచి బాలికలను కాపాడుకోవాలంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. 

వృద్ధాప్యంలో ఇలాంటి పనులు అవసరమా అంటూ కొందరు.. సదుద్దేశంతోనే ఎమ్మెల్యే గౌరీ శంకర్ పిల్లలను దగ్గరకు తీసుకున్నారని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చిన్నారులు, అందులోనూ అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

గతేడాది కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు, ఎందుకంటే?

కర్ణాటకలో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం దుమారం రేపుతోంది. సదరు ఎమ్మెల్యే తనను ఏకంగా 14 ఏళ్ల నుంచి లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ ఫిర్యాదు అందగానే.. ఎమ్మెల్యే ఆమెపై రివర్స్ కేసు పెట్టారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ మహిళే తనను బ్లాక్​మెయిల్​చేస్తూ తన నుంచి రూ.2 కోట్లు డిమాండ్​ చేస్తుందని ప్రత్యారోపణ చేశారు.

Source link