BJP Telangana : ఫ్లోర్ లీడర్ గా మహేశ్వర్ రెడ్డి, ఈ ఎమ్మెల్యేలకు కొత్త బాధ్యతలు

Nirmal MLA Aleti Maheshwar Reddy : తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంది బీజేపీ తెలంగాణ నాయకత్వం. నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరగా మహేశ్వర్ రెడ్డి పేరు ఖరారైంది. పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణరెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించింది. శాసనమండలిలో బీజేపీ తరపున ఎవీఎన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ గా ఉండనున్నారు.

Source link