ByGanesh
Wed 29th Jan 2025 09:44 PM
నాగ చైతన్య-సాయి పల్లవిల తండేల్ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో మొదలైపోయాయి. సాయి పల్లవి ఇంటర్వ్యూలలో పాల్గొంటుంటే నాగ చైతన్య అభిమానుల నడుమ ట్రైలర్ లాంచ్ అంటూ హడావిడి చేస్తున్నాడు. ఫిబ్రవరి 7 న రాబోతున్న తండేల్ చిత్రంలో నాగ చైతన్య-సాయి పల్లవి ల కెమిస్ట్రీ హైలెట్ అవడం పక్కాగా కనిపిస్తుంది.
పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలవుతున్న తండేల్ చిత్రానికి బాలీవుడ్ మీడియా బాగా ప్రమోట్ చేస్తుంది. కారణం సాయి పల్లవి రామాయణ తో నార్త్ కి ఎంట్రీ ఇవ్వడం ఒకటైతే, మరొకటి చందు మొండేటి కార్తికేయ నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యి మంచి హిట్ కలెక్షన్స్ సాధించాయి.
మరోపక్క దూత వెబ్ సీరీస్ తో నాగ చైతన్య పాన్ ఇండియా భాషలకు పరిచయమయ్యాడు. దానితో బాలీవుడ్ మీడియా తండేల్ ను హిందీలో ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. హిందీ వెబ్ సైట్స్, అలాగే సోషల్ మీడియాలోను తండేల్ ని ప్రమోట్ చెయ్యడం చూసి తండేల్ కు బాలీవుడ్ ప్రమోషన్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఎల్లుండి అంటే జనవరి 31 న ముంబైలో తండేల్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు మేకర్స్. తమిళనాట రేపు గురువారం హీరో కార్తీ తండేల్ తమిళ ట్రైలర్ విడుదల చెయ్యబోతున్నారు.
Bollywood promotion coming to Tandel:
Thandel team press meet to Mumbai