Bombay High Court announces key verdict in case of cheated girl | Court : బాంబే హైకోర్టులో కోర్ట్ సినిమా సీక్వెల్ సీన్

Bombay High Court Pocso Case : పోక్సో చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందన్న దానిపై కోర్టు అనే సినిమాను తీశారు హీరో నాని. నిర్మాతగా ఆయన తీసిన ఈ సినిమా చాలా మందిని ఆలోచింప చేసింది. అయితే అందులో లవర్స్ కథ ఇది. ప్రేమికుడిపై పోక్సో కేసును అక్రమంగా పెట్టడం కథ. బొంబే హైకోర్టులో కాస్త అటూ ఇటూ 
అలాంటి సినిమా స్టోరీ లాంటి కేసే విచారణకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే అది కోర్టు సినిమా సీక్వెల్ లాంటి స్టోరీ అనుకోవచ్చు. 
 
2020లో యూపీకి చెందిన 22 ఏళ్ల యువకుడితో కలిసి న్యూముంబైకి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంటి నుంచి పారిపోయింది. 10 నెలల తరువాత గర్భంతో ఇంటికి తిరిగి వచ్చింది బాలిక. యువకుడు తనను ప్రేమ పేరుతో తీసుకెళ్లాడని ఇప్పుడు తనను పెళ్లి చేసుకోకుండా వదిలేశాడని బావురుమన్నది. దీంతో  యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశాడు తండ్రి. విచారణ జరిపిన బాంబే హైకోర్టు ‘బాలిక ఇష్టప్రకారమే వెళ్లిందని, ఆమెకు ఏం జరుగుతుందో తెలుసు’ అని యువకుడికి బెయిల్ మంజూరు చేసింది. సాధారణంగా బాలికలు ఇష్ట ప్రకారం వెళ్లినప్పటికీ.. ఇష్టప్రకారం లైంగిక చర్యలో పాల్గొన్నప్పటికీ చట్టాలు అత్యాచారంగానే భావిస్తాయి. కానీ ముంబై కోర్టు మాత్రం భిన్నంగా తీర్పు ఇవ్వడంతో వైరల్ గా మారింది. 



ఈ తీర్పుపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది సమర్థిస్తూండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.  



కొంత మంది రేపిస్టులను వ్యవస్థలు రక్షిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.  



      ఈ కేసుపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. 

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link