Brahmanandam In Megastar Bholaa Shankar Movie భోళాకు బ్రహ్మి బూస్ట్.. ఇదిగో సాక్ష్యం


Thu 13th Jul 2023 09:03 PM

brahmanandam,guest role,chiranjeevi,bholaa shankar  భోళాకు బ్రహ్మి బూస్ట్.. ఇదిగో సాక్ష్యం


Brahmanandam In Megastar Bholaa Shankar Movie భోళాకు బ్రహ్మి బూస్ట్.. ఇదిగో సాక్ష్యం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమా ఆగస్ట్ 11న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మెగాస్టార్ తన పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకుని విహారయాత్రకు వెళ్లగా.. ప్రస్తుతం ఇతర నటీనటుల డబ్బింగ్‌లో దర్శకుడు మెహర్ రమేష్ బిజీబిజీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని ఆగస్ట్ 11కి తీసుకు రావాలని మెహర్ రమేష్ కష్టపడుతున్నారు. 

ఇక ఈ సినిమాలో చిరంజీవికి ఎంతో ఇష్టమైన బ్రహ్మానందం కూడా ఓ అతిథి పాత్ర చేస్తున్నట్లుగా తాజాగా మేకర్స్ రివీల్ చేశారు. అదెలా అంటే.. ఈ సినిమాలో చేసిన పాత్రకు బ్రహ్మానందం డబ్బింగ్ చెబుతున్న పిక్‌ని యూనిట్ విడుదల చేసింది. ఈ పిక్‌లో బ్రహ్మానందం డబ్బింగ్ చెబుతుండగా.. పక్కన దర్శకుడు మెహర్ రమేష్ హెల్ప్ చేస్తున్నారు. ఈ పిక్‌తో భోళా శంకర్‌కు బ్రహ్మీ బూస్ట్ ఇవ్వబోతున్నాడనేలా సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. తనది చిన్న పాత్రే అయినా.. చాలా ఇంపాక్ట్ ఉంటుందని బ్రహ్మి అంటున్నారు. అసలు బ్రహ్మి కనబడితే చాలు.. ఇంకా ఇంపాక్ట్‌తో పనేముంది. అంతే కదా. 

చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం భాగమవుతోంది. ముఖ్యంగా కీర్తి సురేష్ ఇందులో మెగాస్టార్‌కి చెల్లెలిగా నటించింది. కీర్తిని ప్రేమించే పాత్రలో యంగ్ హీరో సుశాంత్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు ఇప్పటికే భారీ అంచనాలను పెంచేయగా.. రాబోయే ట్రైలర్‌తో భోళా విశ్వరూపం చూస్తారని మేకర్స్ అంటున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Brahmanandam In Megastar Bholaa Shankar Movie:

Brahmanandam Finished Dubbing for Bholaa Shankar Guest Role





Source link