Brazilian influencers Disrespectful roasted for filming Indian woman in a saree Disrespectful | Brazilian influencers: బట్టలేసుకోని బ్రెజిల్ ఇన్‌ఫ్లూయర్లు చీర కట్టుకున్న భారత మహిళను ఎగతాళి చేశారు

Brazilian influencers: సోషల్ మీడియాలో ఫేమ్ కోసమో.. మరో కారణమో కానీ భారత్ కు సంబంధించిన అంశాలపై రోస్టింగ్ పేరుతో స్పందించేవారు ఎక్కువైపోయారు. తాజాగా ఓ భారత మహిళ చీర కట్టుపై బ్రెజిలియన్ ఇన్ ప్లూయన్సర్లు ఎగతాళిగా వ్యాఖ్యలు చేశారు. ఓ మాల్ లో స్వీపింగ్ పని చేస్తున్న మహిళ చీర కట్టుకున్నారు. అది ఆమె డ్రెస్సింగ్ స్టైల్. ఈ వీడియోను బ్రెజిల్ కు చెందిన  ట్విన్ ఇన్ ఫ్లూయన్సర్స్ తమ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసి ఫ్యాన్సీ క్లీనర్ ఇన్ ఇండియా అని క్యాప్షన్ పెట్టారు.  




 

ఈ కవల ఇన్ ఫ్లూయన్సర్స్ ఇద్దరూ ప్రస్తుతం భారత్ లోనే డీజేలుగా పని చేస్తున్నారు. దీంతో ఆమె పోస్టుపై నెటిజన్లు మండిపడ్డారు. బ్రెజిల్ లో మహిళల వస్త్రధారణను  పోల్చి విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రెటిల్ మహిళలు ఎక్కువగా శరీర భాగాలు అన్నీ కనిపించే దుస్తులు వేసుకుంటారు. ఎంత ఎందుకు ఈ విమర్శలు చేసిన కవల బ్రెజిల్ వాసులు ఇద్దరూ కూడా అలాంటి పొట్టి డ్రెస్‌లలోనే తిరుగుతూ ఉంటారు.అదే విషయాన్ని వారికి గుర్తు చేసి.. భారత సంస్కృతి, సంప్రదాయాలు వస్త్రధారణ గురించి  క్లాస్ తీసుకుంటున్నారు.              

ఈ సిస్టర్స్ ఇద్దరు కూలిసి నిర్వహిస్తున్న  ఇన్ స్టా అకౌంట్ చూస్తే అసలు పూర్తిగా బట్టలేసుకున్న ఫోటోలు కానీ వీడియోలు కానీ లేవు. తమ దేశంలో అలా ఉంటారు కాబట్టి.. భారత్ లోనూా అలాగే ఉంటారన్న అభిప్రాయంతో .. ఈ పోస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. నిజానికి ఆ స్వీపింగ్ చేస్తున్న మహిళ వీడియోను వీళ్లే తీశారు. ఆ సమయంలో ఆ సిస్టర్స్ లో ఒకరిని తీస్తున్నట్లుగా వీడియో తీశారు. ఆ యువతి ఒంటిపై సరిగ్గా బట్టల్లేవు . ఇదే విషయాన్ని నెటిజన్లు ఎత్తి చూపుతున్నారు.                            

ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలు. డ్రెస్సింగ్ల గురించి మాట్లాడేటప్పుడు చాలా విషయాలు తెలుసుకుని మాట్లాడాలని సలహాలిస్తున్నారు. అయితే ఇండియాలోనే పని చేస్తున్న ఈ సిస్టమ్స్.. ఫేమ్ కోసం ఇన్ స్టా ఫాలోయర్ల కోసం ఇలాంటి పోస్టులు పెడుతున్నారన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోస్టులు పెట్టిన తర్వాత నెగెటివ్ ప్రచారం వచ్చినా వారి పోస్టులన్నీ స్పైసీగా ఉండటంతో కొంత మంది ఫాలో చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదే ఎఫెక్ట్ కోసం  ఆ సిస్టర్స్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని భావిస్తున్నారు.          

Also Read: ఆ చిన్న గ్రామంలో అందరూ యూట్యూబర్లే – బయటకు వెళ్లకుండా లక్షల సంపాదిచేస్తున్నారు !

మరిన్ని చూడండి

Source link