ByGanesh
Sun 16th Mar 2025 07:05 PM
హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఉన్న విశ్వక్ సేన్ నివాసంలోకి ఆదివారం తెల్లవారు ఝామున ఓ దుండగుడు చొరబడి, విశ్వక్ సేన్ అక్క బెడ్ రూమ్ నుంచి చేతికందిన సొత్తు దోచుకుని పరారయ్యాడు. విశ్వక్ సేన్ ఆయన తల్లితండ్రులు, అక్క వన్మయి అందరూ కలిసి ఫిలిం నగర్ లో ఒకే ఇంట్లో ఉంటున్నారు.
విశ్వక్ సేన్ అక్క వన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున వన్మయి గదిలో వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చిన ఆమె రూమ్ లోని ఆల్మారాలను పరిశీలించింది. అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వన్మయి ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించారు.
విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
Burglar strikes at actor Vishwak Sen house:
Theft in Actor Vishwak Sen House