EV charging station :దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు విపరీతంగా పెరుగుతోంది. మొన్నటి వరకు ప్రాంతానికి ఒకట్రెండు కనిపించే ఈవీలు ఇప్పుడు గల్లీకి రెండు మూడు కనిపిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కూడా పూర్తిగా ఈవీలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఇంతలా ఈవీలు పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్‌గ ఛార్జింగ్ పాయింట్లు మాత్రం కనిపించడం లేదు. ఒక్కో వెహికల్ ఛార్జింగ్ అవ్వడానికి గంటల సమయం తీసుకుంటున్నాయి. అందుకే ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల వద్ద తాకిడి పెరిగిపోతోంది.
ప్రభుత్వాలు కూడా ఈవీలను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ రవాణా సంస్థల్లో కూడా ఈవీలు ఎక్కువగా వాడుతున్నాయి. అందుకే ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లు మరిన్ని రవావాల్సిన అవసరం ఉంది. అయితే ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఎవరైనా పెట్టుకోవచ్చా… దీనికి కూడా పెట్రోల్ బంకుల మాదిరి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఎవరైనా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఇదో ఉపాధి అవకాశంగా మార్చుకోవచ్చు. చాలా మందికి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునేందుకు అవకాశం ఎక్యూప్‌మెంట్ ఉండదు. అలాంటి వాళ్లంతా కచ్చితంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌కు వస్తుంటారు. అలాంటి వాళ్ల వద్ద గంటకు ఇంత అని వసూలు చేయవచ్చు. ఇది అధికారింగానే ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సొంతంగా ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం అంత ఈజీ కాదు. దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిన్నింటిని ఫాలో అవుతూ ఇంట్లో ఛార్జింగ్ కోసం ఏర్పాటు చేసుకోవడం ఇబ్బందే. అందుకే ఇలాంటి వాళ్లంతా ఛార్జింగ్ స్టేషన్‌పై ఆధారపడుతున్నారు. హైవేలపై ఇంకా ఈ ఛార్జింగ్ స్టేషన్‌లు ఎక్కువగా కనిపించడం లేదు. వీటి కోసం చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది.
ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కోసం ముఖ్యంగా విద్యుత్ సరఫరాను దృష్టిలో పెట్టుకోవాలి. ఎలాంటి ఛార్జర్ పెడుతున్నామనేది చాలా ముఖ్యం. ఏసీ, డీసీ రెండు విధానాల్లో కూడా ఛార్జింగ్ చేయవచ్చు కానీ ఏసీ ఇంట్లో ఉన్న ఓకే. ఖర్చు కూడా తక్కువే అవుతుంది. ఆలస్యంగా ఛార్జ్ అవుతుంది. ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
డీసీతో కూడిన ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తేనే త్వరగా ఛార్జింగ్ అవుుతంది. కమర్షియల్ సెటప్‌కు ఇదే ఉత్తమమైంది. ఈవీ వాహనదారులకు త్వరగా పని పూర్తి అవ్వడానికి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ డీసీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం దాదాపు ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఖర్చు పెట్టాలి. అందరికీ అనువైన ధరల్లో సర్వీస్ అందించేందుకు మాత్రం రెండూ ఉంటేనే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
ఇన్‌స్టాలేషన్ ఖర్చు అనేది మీరు స్టేషన్ ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉండే మౌలిక సదుపాయలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ప్రాంతంలో విద్యుత్ గ్రిడ్ సమీపంలో ఉంటే మీకు ఖర్చు తక్కువ అవుతుంది. లేదంటే మీరు ప్రత్యేకంగా విద్యుత్ లైన్లు వేసుకోవాల్సి ఉంటుంది. అందుకు భారీగా ఖర్చు పెట్టాలి. అందుకే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మాత్రం హైవేకు సమీపంలో ఎంచుకోవడం మంచిది.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే మీకు యాభై గజాల స్థలం ఉండాలి లేదంటే లీజుకు తీసుకొని ఉండాలి. ఇలా ఉన్న భూమిలో అనుమతి కోసం స్థానిక విద్యుత్ బోర్డును, మున్సిపల్, పంచాయతీ అధికారులను సంప్రదించాలి. వారి అనుమతి తీసుకున్న తర్వాతే ఇక్కడ పనులు ప్రారంభించాల్సి ఉంటుంది.
కరెక్టుగా ప్లాన్ చేస్తే 10 నుంచి 30 లక్షలు మధ్య మీ పెట్టుబడి సామర్థ్యం బట్టి ఖర్చు పెట్టి మీరు ఒక ఈవీ ఛార్చింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ప్రతి నెల విద్యుత్ ఖర్చులు, సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించిన ఖర్చు ఏమీ ఉండదు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది.
ఫేమ్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. సబ్సిడీలు ఇతర రాయితీలు మీరు ఏర్పాటు చేసే ఛార్జింగ్ స్టేషన్ కెపాసిటీ, వాడే పరికరాలు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని చూడండి