Central Government is Working to Increase Loan limit of Kisan Credit card to 5 lakh | Kisan Credit Card: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

Kisan Credit Card: ఫిబ్రవరి తొలివారంలో  రైతుల ఖాతాలో పీఎం కిసాన్ సమ‌్మన్‌ యోజన నగదు జమ చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం…అంతకన్నా ముందే మరో తీపి కబురు రైతులకు అందించనుంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేయనుంది. కిసాన్ క్రెడిట్‌ కార్డు(Kisan Credit Card) పై ఇప్పటి వరకు ఉన్న రుణపరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచేందుకు కసరత్తు చేస్తోంది.

కిసాన్ క్రెడిట్‌కార్డు
కిసాన్ క్రెడిట్‌కార్డు (KCC)పథకాన్ని కేంద్రప్రభుత్వం 1998లోనే  ప్రారంభించింది. వ్యవసాయం చేసే  రైతులకు అతితక్కువగా  9శాతం వడ్డీతో స్వల్పకాలిక పంట రుణాలను ఈ  క్రెడిట్‌కార్డు ద్వారా అందిస్తోంది. ఇందులో 2శాతం వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. పైగా సకాలంలో  రుణాలు చెల్లించే వారికి అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తోంది. అంటే రైతులు చెల్లించాల్సింది కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే. 2023 జూన్ నాటికి ఈ పథకం కింద  దేశవ్యాప్తంగా 7.4 కోట్ల మంది యాక్టివ్ క్రెడిట్‌ కార్డు ఖాతాలు ఉన్నాయి. వీరందరికి 8.9 లక్షల కోట్ల రుణం ప్రభుత్వం అందించింది.

పరిమితి పెంపు
పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా  ఈ కిసాన్ క్రెడిట్‌ కార్డు రుణపరిమితి పెంచాలని రైతులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. రైతులకు తక్కువ ధరకు రుణాలు అందించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని వ్యవసాయరంగ నిపుణులు సైతం సూచించారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న  కేంద్ర ప్రభుత్వం(Central Governament)….కిసాన్ క్రెడిట్‌ కార్డుల రుణపరిమితిని పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిద్వారా వ్యవసాయం చేసే రైతులకే గాక..పశుపోషణ మరియు  చేపల పెంచే రైతులకూ  ఈ పథకం వర్తించడం ద్వారా చాలా మేలు కలుగుతుంది.

కిసాన్ క్రెడిట్‌కార్డు పొందడం ఎలా..?

రైతు ఆదాయం, గత రుణ చరిత్ర, వ్యవసాయ భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రుణం మంజూరు చేస్తారు. ఒకసారి కిసాన్ క్రెడిట్‌కార్డు తీసుకుంటే ఐదుసంవత్సరాల పాటు కాల పరిమితి ఉంటుంది. ఈ ఐదేళ్లలో రూ.5లక్షల రుణం అందిస్తారు. అలాగే ఈ కార్డు కలిగి ఉన్న రైతులకు  ప్రభుత్వమే బీమా రక్షణ కల్పిస్తుంది. రైతు మరణిస్తే…కుటుంబానికి  రూ.50వేల వరకు ఆర్థికసాయం అందుతుంది.కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు రైతులకు పొదుపు ఖాతా, డెబిట్ కార్డ్‌, స్మార్ట్ కార్డ్‌ అందిస్తారు. ఆ ఖాతాలో చేసే పొదుపుపై ​వడ్డీ వస్తుంది. 

అర్హులు

కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే రైతుల వయసు 18 నుంచి 75 ఏళ్లు మించరాదు.

* వసాయ భూమి కలిగి ఉన్న  రైతులు

* కౌలు రైతులు

* ఆక్వా రైతులు

*  మత్స్యకారులు 

* గొర్రెలు,కుందేళ్లు,పందులు, పక్షులు, కోళ్ల పెంపకం దారులు

* పశు పోషకులు

దరఖాస్తు చేసుకునే విధానం 

* ఏ బ్యాంకు నుంచైతే రుణం తీసుకోవాలనుకుంటున్నారో  ఆ బ్యాంకు వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.

* ఆ తర్వాత కిసాన్‌కార్డు  ఆప్షన్  ఎంచుకోవాలి

* ధరఖాస్తు ఫారం ఓపెన్‌ కాగానే వివరాలన్నీ నమోదు చేసి  Submit బటన్‌ నొక్కాలి

* మీ అర్హతలన్నీ పరిశీలించిన  తర్వాత బ్యాంకు కిసాన్ క్రెడిట్‌ కార్డు  జారీ చేస్తుంది.

* ఆఫ్‌లైన్‌లోనూ బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని చూడండి

Source link