Sahkar Taxi Service: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ట్రావెల్ అగ్రిగేటర్లతో విసిగిపోతున్న జనం కోసం ప్రభుత్వ అగ్రిగేటర్ తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు సహకార్ పేరుతో ట్యాక్సీ సర్వీస్ తీసుకొస్తున్నట్టు లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు.
ప్రైవేటు అగ్రిగేటర్లు చాలానే ఉన్నాయి. అయితే కమీషన్లు, ఛార్జీలతో అటు డ్రైవర్లను, ఇటు ప్రజలను దోచుకుంటున్నాయనే విమర్శ ఉంది. సేఫ్టీ విషయంపై కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సర్వీస్ తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ప్రభుత్వం సర్వీస్‌తో డ్రైవర్లకు హెల్ప్ చేయడమే కాకుండా స్థానిక సహకార సంఘాలకి కూడా ఊతమివ్వాలని చూస్తోంది కేంద్రం. వారి ఆధ్వర్యంలోనే వీటిని రన్ చేయనున్నారు. ఈ సహకార్‌లో చేరాలంటే సహకార సంఘాల వద్దే డ్రైవర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ సహకార్ సర్వీస్ వల్ల ఎవరిలీ కమీషన్లు ఇవ్వాల్సిన పని లేదని అమిత్‌షా తెలిపారు. ఆ లాభాలు పూర్తిగా డ్రైవర్లే తమ వద్ద ఉంచుకోవచ్చని అన్నారు. దీంతో వారికి మరింత ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. ప్రైవేటు అగ్రిగేటర్లతో ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నాయి. తరచూ వాళ్లకు వ్యతిరేకంగా డ్రైవర్లు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయ.
ప్రైవేటు ట్యాక్సీ సర్వీసు సంస్థలకు కమీషన్లు ఇవ్వడం ఇష్టం లేని చాలా రాష్ట్రాల్లో డ్రైవర్లంతా కలిసి ప్రత్యేకంగా యాప్ డిజైన్ చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం యాప్ డిజైన్ చేసి ప్రజలకు సేవలు అందిస్తోంది. ఇలాంటి ఘటనలు పరిశీలించిన కేంద్రం దేశవ్యాప్తంగా ఒకటే సర్వీసు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సహకార్ ఆలోచన చేసింది. దీని కోసం మూడేళ్ల నుంచి కసరత్తు జరుగుతున్నట్టు అమిత్‌షా సభలో తెలిపారు.
మరిన్ని చూడండి