Chandrayaan 3 Launched Chandrayaan-3 Scripts A New Chapter In India’s Space History, Says PM Modi | Chandrayaan 3 Launched: భారత్ అంతరిక్ష చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం, మీ పట్టుదలకు సెల్యూట్

Chandrayaan 3 Launched: 

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకి అభినందనలు తెలిపారు. భారత దేశ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రశంసించారు. చంద్రయాన్ 3 ప్రతి భారతీయుడి కలల్ని, ఆకాంక్షల్ని మోసుకెళ్లిందని అన్నారు. ఇది మన శాస్త్రవేత్తల పట్టుదలకి, నిబద్ధతకి నిదర్శనం అని కొనియాడారు. 

“భారత దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్ 3 కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోని ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసుకెళ్లింది. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం. వాళ్ల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకి సెల్యూట్”

– ప్రధాని నరేంద్ర మోదీ 

 

Source link