Chapata Chilli: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 80 ఏళ్లుగా రైతులు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటూ సాగు చేస్తున్న చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. స్థానికంగా చపాటా, టమాట మిర్చిగా పిలుచుకునే ఈ మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్ లభించింది.