Kedarnath Yatra Full Trip Details : చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra 2025)లో ప్రధానంగా నాలుగు ఆలయాలు ఉంటాయి. యమునోత్రి (Yamunotri), గంగోత్రి (Gangotri), కేదార్నాథ్ (Kedarnath), బద్రీనాథ్ (Badrinath). ఈ నాలుగు ప్రదేశాలకు కామన్ పాయింట్ హరిద్వార్ అని చెప్పొచ్చు. ఈ నాలుగు ఆలయాలు దర్శించుకుంటే చార్ ధామ్ యాత్ర పూర్తి అవుతుంది. వీటిలో కష్టపడి చేరుకోవాల్సిన ఆలయం కేదార్నాథ్. ఎందుకంటే సుదీర్ఘమైన ట్రెక్కింగ్ తర్వాతనే ఈ ఆలయాన్ని చేరుకోగలుగుతాము. మీరు కూడా ఈ సారి కేదార్‌నాథ్‌కి వెళ్లాలనుకుంటే తెలుగు రాష్ట్రాలనుంచి ఎలా వెళ్లొచ్చో.. ఈ చార్ ధాం యాత్రను ఎలా పూర్తి చేయొచ్చో ఇప్పుడు చూసేద్దాం.
చార్ ధామ్ యాత్రకు వెళ్లాలనుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి డైరక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. హైదరాబాద్ నుంచి అయినా, విశాఖపట్నం, విజయవాడ.. ఇలా ప్రదేశం నుంచి అయినా మీరు ఈ యాత్ర ప్రారంభించాలనుకుంటే డైరక్ట్ ఢిల్లీ వెళ్లిపోవాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకునే వాటిని బట్టి ఈ రైలు టికెట్ ధరలు మారుతూ ఉంటాయి. ఢిల్లీ నుంచి నాలుగు ఆలయాలకు మెయిన్ పాయింట్ అయిన హరిద్వార్‌కి ట్రైన్లో వెళ్లొచ్చు. థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకుంటే 500 నుంచి 550 మధ్య ఉంటుంది. ఢిల్లీ నుంచి మీరు రిషికేష్‌కి వెళ్లినా పర్లేదు. ఒకవేళ జర్నీ ఎక్కువ అవుతుందనుకునేవారు ఫ్లైట్‌లో వెళ్లాలనుకుంటే.. చార్ధాంకి దగ్గర పాయింట్ డెహ్రడూన్ ఎయిర్‌పోర్ట్‌కి కూడా వెళ్లొచ్చు. టైమ్ కలిసి వస్తుంది. కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. బడ్జెట్లో వెళ్లాలనుకుంటే ట్రైన్ జర్నీ బెస్ట్.
రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యం..
చార్ధామ్ యాత్రకు వెళ్లేవారు కచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే.. రిజిస్ట్రేషన్. ఇది లేకుండా చార్ ధామ్ యాత్ర చేయలేరు. ఈ ప్రాసెస్ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. దూరం నుంచి వెళ్లేవారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిది. కేదార్ నాథ్‌కి వెళ్లాలంటే హరిద్వార్ నుంచి సోనుప్రయాగ్కి వెళ్లాలి. దీనికి బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటిని ఆఫ్‌లైన్, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. దీని ధర 500 ఉంటుంది. దాదాపు 8 గంటల జర్నీ ఉంటుంది. సోను ప్రయాగ్‌లో హోటల్స్ ఉంటాయి. మీరు స్టే చేయవచ్చు. లేదంటే గౌరి కొండకి వెళ్లి అక్కడ స్టే చేయవచ్చు. అక్కడి నుంచి మీరు కేదార్‌నాథ్‌కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయవచ్చు. బడ్జెట్ తక్కువుంటే సోను ప్రయాగ్‌లో బస చేయడమే మంచిది.
ట్రెక్కింగ్
కేదార్‌నాథ్‌కి ట్రెక్కింగ్‌ని ఆర్చ్నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. దూరం 22 కిలోమీటర్లు ఉంటుంది. మూడు రకాలుగా ఈ ట్రెక్‌ని కంప్లీట్ చేయొచ్చు. ఒకటి నడిచి వెళ్లొచ్చు. రెండు గుర్రాల సహాయంతో ట్రెక్ కంప్లీట్ చేయొచ్చు. మూడోది డోలి సహాయంతో వెళ్లొచ్చు. ఎక్కువదూరం ట్రెక్ చేయనివారికి నడక కంటే ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు. లేదు అనుకుంటే స్పెషల్ హెలీకాప్టర్లు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా కూడా కేదార్నాథ్ వెళ్లొచ్చు. వీటిని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ట్రెక్ చేస్తూ పైకి వెళ్లేవారు షూస్ వేసుకుంటే మంచిది. కంఫర్ట్‌బుల్‌గా ఉంటాయి. అలాగే ముఖ్యమైన లగేజ్‌ని మరీ ఎక్కువ కాకుండా.. అవసరమైన వాటిని ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లాలి. నెక్స్ట్ డే మార్చుకోవడానికి ఓ జత దుస్తులు కూడా తీసుకెళ్తే మంచిది. ఇలా ట్రెక్ ద్వారా ఆలయానికి చేరుకోవడానికి 7 నుంచి 8 గంటలు పడుతుంది. మధ్యలో క్యాంప్స్ ఉంటాయి. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కేదార్‌నాథ్‌కి రీచ్ అయిన తర్వాత హోటల్స్ లేదా టెంట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టే చేసి తర్వాత టెంపుల్‌కి వెళ్లొచ్చు.
అది మరచిపోకండి..
రిజిస్ట్రేషన్ డిటైల్స్ చూపిస్తే స్లిప్ ఇస్తారు. దీనితో దర్శనానికి వెళ్లిపోవచ్చు. అనంతరం భైరవ బాబా ఆలయాన్ని దర్శించుకుంటే కేదారనాథ్ యాత్ర కంప్లీట్ అవుతుంది. కేదారనాథ్ దర్శించుకున్న తర్వాత దీనిని కచ్చితంగా దర్శించుకోవాలని చెప్తారు. అనంతరం మీరు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను కూడా దర్శించుకుని చార్ధాం యాత్రను ముగించుకోవచ్చు. లేదంటే కేదారనాథ్ యాత్ర ఒక్కటి కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయిపోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ట్రెక్కింగ్ ద్వారా వెళ్లకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.
Also Read : కేదార్నాథ్ యాత్ర 2025 ప్రారంభ తేది ఇదే.. యాత్ర ప్రాముఖ్యత, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే
మరిన్ని చూడండి