Chattisgarh ABP CVoter Exit Poll 2023 Who Will Win Chhattisgarh, Know The Predictions Here

Chattisgarh ABP CVoter Exit Poll: 

ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్ 

ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న తొలి విడత 20 సీట్లకు, నవంబర్ 17న 70 స్థానాలకు ఎన్నికలు (chattisgarh election 2023) జరిగాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఈ ఎన్నికల్లో తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది బీజేపీ. కాంగ్రెస్ మాత్రం తమ గెలుపుపై ధీమాగా ఉంది. అయితే…ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పటికే కొన్ని సర్వేలు వెల్లడించాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌ హడావుడీ మొదలైంది. ఇప్పటికే ABP CVoter Opinion Poll ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలపై కొన్ని అంచనాలు విడుదల చేసింది. ఇప్పుడు ABP CVoter Exit Poll ఫలితాలూ విడుదలయ్యాయి. ఈ అంచనాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి 41-53 సీట్లు వచ్చే అవకాశముంది. బీజేపీ 36-48 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇతరులు 0-4 వరకూ గెలుచుకుంటారని వెల్లడించింది. గతేడాది కాంగ్రెస్‌ 68 స్థానాలు సాధించింది. ప్రస్తుత అంచనాల మేరకు 47 సీట్లకే పరిమితం కానుంది. ఇక బీజేపీ మాత్రం బాగానే పుంజుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 42 సీట్లు గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఓటు శాతం పరంగా చూస్తే…కాంగ్రెస్‌కి గత ఎన్నికల్లో 43.1% ఓట్లు దక్కాయి. బీజేపీ 33% ఓట్లు రాబట్టుకోగలిగింది. ఈసారి కాంగ్రెస్‌కి 43.4%, బీజేపీకి 41.2% మేర ఓట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశాయి ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్. సెంట్రల్ ఛత్తీస్‌గఢ్‌లో 64 సీట్లున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఇక్కడి ఓటర్లే డిసైడ్ చేస్తారు. 

సెంట్రల్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ 31-35 సీట్లు గెలుచుకునే (ABP CVoter Exit Polls 2023) అవకాశాలున్నాయి. బీజేపీ 28-32 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేసింది. ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 43 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుతం గరిష్ఠంగా 33 సీట్లు గెలుచుకునే అవకాశముంది. ఇక బీజేపీ విషయానికొస్తే…సెంట్రల్ ఛత్తీస్‌గఢ్‌లో గత ఎన్నికల్లో 14 సీట్లు వచ్చాయి. ఈ సారి అవి 30 వరకూ పెరగనుంది. నార్త్ ఛత్తీస్‌గఢ్‌లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ 5-9 సీట్లు, బీజేపీ 5-9 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం ఫలితాలను రెండు సినారియోలుగా చూస్తే…ఒకవేళ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఆ పార్టీకి 29-35 సీట్లు మాత్రమే వచ్చే అవకాశముంది. ఇదే సమయంలో బీజేపీ 54-60 స్థానాల్లో గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. సినారియో -2 ప్రకారం చూస్తే…ప్రస్తుత ప్రభుత్వంపై ఓటర్లు పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉంటే కాంగ్రెస్‌కి 56-62 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ 27-33 సీట్లకే పరిమితమవనుంది. 

Source link