Viral Video: ఒక భయానకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొంత మంది పిల్లలు చనిపోయిన పాముతో ఆడుకుంటూ కనిపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటివి ప్రమాదకరమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పాము పేరు వింటేనే చాలా మంది వణికిపోతారు. ఆ పేరు వినడానికే మరికొందరు భయపడతారు. కానీ ఇక్కడ చిన్నారులు పార్కులో చచ్చిన పాములు ఎలాంటి భయం లేకుండా ఇష్టం వచ్చిన ఆటలు ఆడేశారు. ఆ వీడియో చూసిన తర్వాత ప్రజలు షాక్ అవుతున్నారు.
కొంతమంది పిల్లలు పార్కులో ఆడుకుంటూ కనిపించారు. అలా ఆడుకుంటూ ఉండగా వారికి సమీపంలో చచ్చిపడిన పాము కనిపించింది. దాన్ని చూసి భయపడి పారిపోకుండా దాన్ని లటక్కన పట్టుకున్నారు.
చనిపోయిన పాముతో తాడు ఆట ప్రారంభించారు
చనిపోయిన పామును తాడులా పట్టుకుని దానితో తాడు ఆట ఆడటం ప్రారంభించాడు. నవ్వుతూ, సరదాగా గడుపుతూ, ఎవరు ఎక్కువసేపు దూకగలరని పిల్లలు ఒకరితో ఒకరు పోటీ పడి ఆడారు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న ఒకరు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిల్లలు పామును ఒక్కొక్కటిగా పట్టుకుని, తిప్పుతూ, తాడులా ఆడుకుంటున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆ వీడియో చూసి సోషల్ మీడియా యూజర్లు షాక్ అయ్యారు.
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, భిన్నమైన ప్రతిస్పందనలు వస్తున్నాయి. మేము చిన్నప్పుడు ఇలాంటి పనులు చేసేవాళ్ళం అని ఒకరంటే. “సోదరా, ఈ పిల్లలు పెద్దయ్యాక ఎలా అవుతారు?” “ఎవరైనా వెళ్లి ఇది ప్రమాదకరమని వారికి వివరించాలి.” అని ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు.
కొంతమంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన పాము శరీరం నుంచి విషపూరిత బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని, ఇది ప్రమాదకరమని అన్నారు. పిల్లలలో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని చెప్పారు. చనిపోయిన పాము కూడా ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది అందుకే అలాంటి ప్రమాదకరమైన ఆటలను ప్రోత్సహించడం మంచిది కాదు.
మరిన్ని చూడండి