China is building the biggest water bomb on the Indian border | China : లక్షా 20వేల కోట్లతో అతి పెద్ద బాంబు – భారత సరిహద్దులో నిర్మిస్తున్న చైనా

China is building the biggest water bomb on the Indian border: రాబోయే రోజుల్లో యుద్దాలు మిస్సైళ్లు, బాంబులతో ఉండే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా సరిహద్దులు ఉన్న దేశాల మధ్య యుద్ధాలు వ్యూహాత్మకంగా జరగనున్నాయి. ఒక్కసారే ఇండియా, బంగ్లాదేశ్ ను ముంచేందుకు చైనా అత్యంత  భారీ ఆయుధాన్ని నిర్మిస్తోంది.ఆ ఆయుధం అతి పెద్ద డ్యాం. ఇందు కోసం 137 బిలియన్లు ఖర్చు పెట్టనున్నారు. అంటే మన కరెన్సీలో కనీసం లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు.  

డ్యాం నిర్మాణానికి లక్షా ఇరవై వేల కోట్లు కేటాయించిన చైనా  

టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై 137 బిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో వుంది.   బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో యార్లంగ్‌ జంగ్బోగా పిలుస్తారు. ప్రస్తుతం టిబెట్‌పై పూర్తి ఆధిపత్యం చైనా ప్రదర్శిస్తోంది.  నదీ దిగువ ప్రాంతంలో పెద్ద జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్‌గా భావించే త్రీ గోర్జెస్‌ డ్యామ్‌కు ఇది దాదాపు మూడు రెట్లు పెద్దదిగా వుంటుంది. ఏడాదికి 300 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని చైనా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఈ ప్రాజెక్టుతో టిబెట్‌కు ఏటా 20 బిలియన్ల యువాన్ల ఆదాయం లభిస్తుందని చైనా చెబుతోంది. 

భారత్, బంగ్లాదేశ్‌లపై వాటర్ బాంబు ఆ ప్రాజెక్టు 

ఈ ప్రాజెక్టు ఉపయోగాల గురించి చైనా ఎన్ని చెప్పినా బంగ్లాదేశ్, ఇండియాలపై వాటర్ బాంబులా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని ఎక్కువ మంది నమ్ముతుననారు. హిమాలయాల్లో బ్రహ్మపుత్ర నది పెద్ద యూ టర్న్‌ తీసుకొని అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. ఈ యూ టర్న్‌ తీసుకునే ప్రాంతంలోని భారీ లోయ వద్ద డ్యామ్‌ను నిర్మించాలని చైనా నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మపుత్ర నదిలోని సగం నీటిని దారి మళ్లించనున్నారు.  బ్రహ్మపుత్ర నది భారత్‌ గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తోంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఇది ప్రధాన నీటి వనరు. ఈ జాలల విషయంలో భారత్‌-చైనా మధ్య ఒప్పందం ఉంది. వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు దిగువనున్న దేశాలకు చైనా తెలియజేయాలి. కానీ చైనా ఆ సమాచారాన్ని సరిగా ఇవ్వడంలేదు.అందుకే పలుమార్లు ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగింది. 

భారత్ ఎలా కౌంటర్ ఇస్తుంది ? 

ఒకేసారి పెద్దమొత్తంలో నీటిని విడుదల చేస్తే.. దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రాజెక్టు భారత్‌-చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒకే సారి నీటిని విడుదల చేస్తే ఈశాన్య రాష్ట్రాలు తుడిచి పెట్టుకుపోతాయి. అందుకే దీన్ని  చైనా ‘వాటర్‌ బాంబ్‌’గా భావిస్తున్నారు.  నిదానిరి టిబెట్‌ ప్రాంతం భూకంప జోన్‌లో ఉంది, అక్కడ తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. అలాంటి చోట ఈ డ్యాం కట్టడం సేఫ్ కాదు. కానీ అది చైనాకు కాదు.  డ్యాంకు ఏం జరిగినా నష్టపోయేది భారత్, బంగ్లాదేశ్‌లే. 

Also Read : Adult content creator : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కన్నా అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం బెటర్ – Phd వదిలేసి ఈ అందగత్తె చేస్తున్నది అదే !

 

 

మరిన్ని చూడండి

Source link