Chinese company has announced that if Employees do not get married they will be fired | Viral News : పని చేయకపోతే కాదు పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారట

No marriage  no job: ఉద్యోగమే ఓ పెద్ద సవాల్. దానికి తోడు మళ్లీ సంసార జీవితం . ఈ రెండు బాధ్యతల్ని మోయలేక మగవాడు కిందా మీదా పడుతున్నాడు. అందుకే చాలా మంది ఇప్పుడు నో మ్యారేజ్ అంటున్నారు. చైనాలో అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉంది. పెళ్లి చేసుకోవడం.. పిల్లల్ని కనడం.. వాళ్లను పెంచడం.. వాళ్లు పిల్లల్ని కనడం.. ఇదేనా జీవితం అనుకుంటున్నారు . ఇంత రొటీన్ లైఫ్ అవసరం లేదని పెళ్లి చేసుకోవడం మానేస్తున్నారు. దీంతో చైనా జనాబా వేగంగా పడిపోతోంది. పుట్టే వాళ్ల కన్నా చనిపోయేవారు ఎక్కువగా ఉన్నారు. యువత తగ్గిపోతున్నారు. దీంతో అక్కడి చైనా ప్రభుత్వం పెళ్లి చేసుకోండి.. పిల్లల్ని కనండి అని బతిమాలుతోంది. పిల్లల్ని కంటే ఖర్చులు కూడా భరిస్తామంటోంది. కానీ యువత మాత్రం మీకో దండం అంటున్నారు. 

దీంతో చైనా ప్రభుత్వం రూటు మార్చింది..  కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. ముదురు బెండకాయలు.. పెళ్లి ఆలోచన లేకుండా సరదాగా ఉద్యోగం చేసుకుంటున్న వారికి అర్జెంట్ గా పెళ్లి చేయాలని ఆదేశించింది. లేకపోతే ఉద్యోగాల నుంచి తీసేయాలని సూచించింది.  చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం చెప్పడం.. చేయకపోవడం అనేది ఉండదు. అందుకే ముందుగా ఘంటియాన్ కెమికల్స్ అనే కంపెనీ తమ హెచ్ ఆర్ పాలసీలో మార్పులు చేసింది. తమ కంపెనీలో పని చేస్తున్న వారికి కొంత సమయం ఇస్తున్నామని పెళ్లి చేసుకోని వారు.. విడాకులు తీసుకున్న వారు కూడా ఆ గడువులోపు పెళ్లి చేసుకోవాలని ఆదేశించింది. లేకపోతే ఉద్యోగం గురించి మర్చిపోవాలని సూచించింది. 

పెళ్లి చేసుకోవడమే కాదు.. పిల్లల్ని కనాలని దేశ జనాభా సంక్షోభాన్ని అధిగమించాలని ఆ కంపెనీ చెబుతోంది. అయితే చాలా మంది ఉద్యోగం అయినా సరే మానేస్తాం కానీ పెళ్లి మాత్రం చేసుకునేది లేదని స్పష్టం చేశారు. ఒకరో ఇద్దరో ఇలా అంటే కోపంతో వారిని ఘంటియాన్ కెమికల్స్ తీసేసేదే. కానీ.. సగం మందికిపైగా పెళ్లి కాని వారు ఉన్నారు. దాదాపు వారంతా.. మీ కంపెనీలో పని చేయడానికే శక్తి అంతా ఉడిగిపోతోంది.. ఇప్పుడు కొత్తగా కుంపటి పెట్టిస్తానంటే సాధ్యం కాదని కావాలంటే మానేసిపోతామన్నారు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం ఆలోచనలో పడింది. పెళ్లి చేసుకుంటే ప్రోత్సహకాలు ఇస్తామని.. మానేయవద్దని చెప్పింది.అయితే ఇక నుంచి ఉద్యోగ నియామకాల విషయంలో మాత్రం ఖచ్ిచతంగా పెళ్లి చేసుకోవాలన్న రూల్ పెట్టాలని నిర్ణయించుకుంది. 

చైనాలో జనాభా సమస్య ఎవరూ ఊహించనంతగా ఉంది. ఒకప్పుడు రెండో బిడ్డను కంటే చైనీయులకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యేవి. ప్రభుత్వం టార్చర్ పెట్టేది. రెండో బిడ్డను  పెంచడం అసాధ్యమయ్యేది. అయితే ఇప్పుడు ముగ్గురు బిడ్డల్ని కంటే ఖర్చులన్నీ భరిస్తామని ఆఫర్ ఇస్తోంది. అంతే కాదు బలవంతంగా పెళ్లిళ్లు చేసి… పిల్లల్ని కూడా కనేలా ఒత్తిడి చేస్తోంది. అందుకే పాపం చైనా అనుకుంటున్నారు అంతా.         

Also Read:  ఇండియాపై గెలవకపోతే నా పేరు షాబాజ్ షరీఫ్ కాదన్నాడు పాకిస్తాన్ ప్రధాని – ఇప్పుడు ఆయనకు ఎన్ని పేర్లు పెడుతున్నారంటే ?

మరిన్ని చూడండి

Source link