ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే క్రిస్టమస్ హాలిడేస్ ని క్యాష్ చేసుకునేందుకు కుర్రహీరోలు పోటీపడేవారు. కొంతమంది స్టార్ హీరోలు కూడా ఈ వీక్ ని క్యాష్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. అయితే ఈ ఏడాది క్రిస్టమస్ వీక్ ని వృధాగా వదిలేసారు అనిపిస్తుంది. ఈ శుక్రవారం విడుదలైన మూవీస్ మొత్తం ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేక చేతులెత్తేశాయి.
డైరెక్ట్ తెలుగు మూవీ అయిన బచ్చలమల్లి చిత్రం తో అల్లరి నరేష్ ఈ క్రిస్టమస్ వీక్ ని టార్గెట్ చేసాడు. కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బచ్చలమల్లి చిత్రానికి పూర్ రివ్యూస్, ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ రావడం డిజప్పాయింట్ చేసింది. ఇక మరో మూడు డబ్బింగ్ మూవీస్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యడంలో విఫలమయ్యాయి.
మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా-ద లైన్ కింగ్ కానివ్వండి, సక్సెస్ ఫుల్ విడుదల చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన విజయ్ సేతుపతి ల విడుదల 2 కానివ్వండి, కన్నడ హీరో ఉపేంద్ర నటించిన UI కానీ ఏ చిత్రము ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మరి క్రిస్టమస్ ముందు క్రిస్టమస్ ఈవ్, క్రిస్టమస్ హాలిడే, బాక్సింగ్ డే హాలీడే, కొన్ని చోట్ల క్రిస్టమస్ హాలిడేస్ అంటూ వారం పదిరోజుల పాటు హాలిడేస్ ఉంటాయి.
కానీ ఈవారంలో రావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అవడం, రెండు వారాల క్రితమే విడుదలైన పుష్ప 2 బ్లా బస్టర్ హిట్ అవడంతో.. యంగ్ హీరోలెవరూ ఈ క్రిష్టమస్ కి వచ్చెందుకు సుముఖత చూపకపోవడంతో ఈ హాలిడేస్ అన్ని వృధా అయ్యాయనే చెప్పాలి.