City killer asteroid : అంతరిక్షం నుంచి భూమి వైపు దూసుకు వచ్చే ఆస్టరాయిడ్స్ చాలా వరకూ భూమికి తగలవు. ఒక వేళ తగిలినా ఇప్పటి వరకూ జనావాసాలు, నగరాలను తాకిన సందర్భాలు లేవు. హాలీవుడ సినిమాల్లో మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హాలీవుడ్ సినిమాల్లో చూపించినా చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆస్టరాయిడ్ సీన్ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నాసా చెబుతోంది. భూమి వైపు ఓ ఆస్టరాయిడ్ దూసుకు వస్తోందని అది దగ్గరకు వచ్చే కొద్దీ.. అది భూమిని తాకేందుకు ఉన్న చాన్సుల శాతం పెరుగుతోందని చెబుతోంది. ఇప్పుడు భూమి వైపు దూసుకు వస్తున్న ఆస్టరాయిడ్ కు సిటీ కిల్లర్ అని నాసా పేరు పెట్టింది. ఇది భూమిని తాకే చాన్సులు 3.1 శాతం వరకూ ఉన్నాయని ప్రకటించింది.
2024 YR4 అనే సాంకేతిక నామంతో ఉన్న ఆస్టరాయిడ్ భూమిని తాకితే.. ఆ ప్రాంతంలో ఓ ప్రధాన నగరం ఉంటే.. మొత్తం నగరం తుడిచిపెట్టుకుపోతుందని సాసా చెబుతుంది. ఇంతకు ముందు ఈ ఉపగ్రహం భూమిని తాకే శాతం తక్కువగా ఉండేది. రాను రాను అది పెరుగుతోంది. నాసాకు చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ .. ఇంతకుముందు 2024 YR4 గ్రహాన్ని ఢీకొనే అవకాశాన్ని 2.6 శాతంగా అంచనా వేసింది. జనవరి చివరి నాటికి ఈ పర్సంటేజీ కేవలం 1 శాతం మాత్రమే. ఇప్పుడు భూమిని తాకే అవకాశం ఉన్న పర్సంటేజీ అంతకంతకూ పెరిగిపోతోంది.
అయితే ఆ ఆస్టరాయిడ్ భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులకు గురి కావొచ్చని చెబుతున్నారు. 2024 YR4 భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తే అది వాయు విస్ఫోటనం కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ఆ గ్రహశకలం దాదాపు ఎనిమిది మెగాటన్ల TNT శక్తితో గాలిలో పేలిపోతుంది – ఇది హిరోషిమా అణు బాంబు శక్తి కంటే 500 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసతుంది. ఇది భూమిని ఢీకొన్నప్పుడు ఢీకొన్నప్పుడు 1,640 నుండి 6,500 అడుగుల ఎత్తులో ఒక బిలం ఏర్పడుతుందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.
చిలీలోని ఎల్ సాస్ అబ్జర్వేటరీ 2024 YR4 ను గుర్తించింది. నాసా తాజా లెక్కల ప్రకారం, ఆ గ్రహశకలం భూమిని డిసెంబర్ 22, 2032న ఢీకొనే అవకాశం ఉంది. నాసా శాస్త్రవేత్తలు ఆ గ్రహశకలం కదలికను పర్యవేక్షిస్తున్నారు . ఆ గ్రహశకలం 40-90 మీటర్ల పరిమాణంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2004లో కనిపెట్టిన ఓ ఆస్టరాయిడ్ 30 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న అపోఫిస్ అనే గ్రహశకలం 2029 నాటికి భూమిని ఢీకొనే అవకాశం 2.7 శాతం ఉందని గుర్తించారు. అయితే ఇటీవల అలాంటి చాన్స్ లేదని ప్రకటించారు.
మరో కథనం: భారత్‌లో ఉద్యోగాలకు ‘టెస్లా’ ప్రకటన – మోదీ చేసిన ‘మ్యాజిక్’ ఇది
మరిన్ని చూడండి