CM focus is all on Chandrababu..! సీఎం ఫోకస్ అంతా చంద్రబాబుపైనే..!


Tue 31st Oct 2023 03:08 PM

chandrababu  సీఎం ఫోకస్ అంతా చంద్రబాబుపైనే..!


CM focus is all on Chandrababu..! సీఎం ఫోకస్ అంతా చంద్రబాబుపైనే..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ఇప్పటికి నాలుగు కేసులు నమోదు చేసింది. దీనికి తోడు తాజాగా మరో కేసు కూడా నమోదు చేసింది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన బయటకు రాకుండా జగన్ ప్రభుత్వం శతవిధాలుగా కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారని ఆరోపించింది. ఇప్పటికే అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌), రాజధాని అసైన్డ్‌ భూములు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, ఫైబర్‌నెట్‌ అంశాల్లో కేసులు పెట్టింది. దీనికి తాజాగా మద్యం కేసు కూడా యాడ్ అయ్యింది. రాష్ట్రంలోని రెండు బ్రూవరీస్‌కు, మూడు డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చారంటూ రాష్ట్ర బ్రూవరీస్‌ ఎండీ వాసుదేవరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.

ఎన్ని కేసులు పెడుతుంది?

వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నెల 28న మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో కేసు నమోదైంది. ఈ కేసులో అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీనివాస శ్రీనరేశ్‌ను ఏ-1గా, నాటి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రను ఏ-2గా.. చంద్రబాబును ఏ-3గా పేర్కొనడం జరిగింది. రాష్ట్రప్రభుత్వానికి 2012-15 మధ్యలో పన్నుల రూపంలో రూ2,984 కోట్లు ఆదాయం వచ్చింది.అయితే 2015లో క్విడ్ ప్రొకో జరిగి ప్రభుత్వానికి ఆదాయం రాలేదని ఎఫ్ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. సరే.. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లాభం చేకూరిందా? లేదంటే నష్టం చేకూరిందా? అనేది తర్వాతి సంగతి. అసలు ఇలా ఎన్ని కేసులు పెడుతూ పోతుంది? ఇంకా ఎంత కాలం చంద్రబాబును టార్గెట్ చేస్తుంది?

అప్పుల ఊబిలో ఎందుకు..?

ఇప్పటికే పెట్టిన కేసులో కనీసం ఆధారాలు సమర్పించలేక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇది చాలదన్నట్టు కేసుల మీద కేసులు. అటు ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం కావాలంటూ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టి ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నారు. ఇంకా కేసుల మీద కేసులు పెడుతూ పోతే టీడీపీపై మరింత సింపతి వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది. వైసీపీ కక్షపూరితంగానే ఈ పనులన్నీ చేస్తోందని క్లియర్‌గా అర్థమవుతుంది. అది వైసీపీకే నష్టం కదా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ రాష్ట్ర ఖజానా నింపాలని లేదు. అలా నింపుకుంటూ పోతే రాష్ట్రం అప్పుల ఊబిలో ఎందుకు కూరుకుపోతుంది? ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్నకొద్దీ రాష్ట్రంపై ఫోకస్ పెట్టాల్సిన జగన్.. చంద్రబాబుపై బీభత్సంగా ఫోకస్ పెడుతున్నారు. ఇక ఇది ఎంత దూరం వెళుతుందో చూడాలి.


CM focus is all on Chandrababu..!:

CM Jaganfocus is all on Chandrababu..!





Source link