CM KCR Review : 4 కోట్ల టన్నులకు చేరనున్న వరి దిగుబడి

విదేశాలకు ఎగుమతి…

రాష్ట్రంలో నిల్వ వున్న 1 కోటి 10 లక్షల టన్నుల వరిధాన్యం, 4 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్.సి.ఐ పలు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతుందని గుర్తు చేశారు. ఈ పంట ఇలాగే ఉంటే అధనంగా మరింత వరి ధాన్యం దిగబడి కానున్న పరిస్థితుల్లో రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేసి, రైతుకు మరింత లాభం చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ప్రస్తుతమున్న రైస్ మిల్లులు యథావిధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడుతామన్నారు.

Source link