Bengaluru techie job call: ఉద్యోగం సంపాదింంచాలంటే ముందు డిగ్రీ ఉండాలి.. తర్వాత రెజ్యూస్ ఉండాలి. కానీ ఇవేమీ అక్కర్లేదు..నేరుగా ఉద్యోగానికి వచ్చేయండి.. నలభై లక్షల జీతం ఇస్తా అంటున్నాడో స్టార్టప్ ఓనర్. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన జాబ్ ఆఫర్ క్షణాల్లో వైరల్ అయింది.
We are looking to hire a cracked full-stack engineer at @smallest_AI
Salary CTC – 40 LPA
Salary Base – 15-25 LPA
Salary ESOPs – 10-15 LPA
Joining – Immediate
Location – Bangalore (Indiranagar)
Experience – 0-2 years
Work from Office – 5 days a week
College – Does not matter…
— Sudarshan Kamath (@kamath_sutra) February 24, 2025
సుదర్శన్ కామత్ అనే యువకుడు స్మాలెస్ట్.ఏఐ అనే స్టార్టప్ పెట్టాడు. ఆ కంపెనీలో పని చేసేందుకు ఫుల్ స్టాక్ ఇంజినీర్ అవసరం అయ్యాడు. వెంటనే తన ట్విట్టర్ అకౌంట్లో ఈ జాబ్ ఓపెనింగ్ ప్రకటించాడు. మీరు కాలేజీకి వెళ్లి చదువుకున్నారా లేదా అన్న విషయాన్ని తాను పట్టించకోనన్నాడు. అంతే కాదు రెజ్యూమ్ కూడా అవసరం లేదని స్పష్టం చేశాడు. కానీ జాబ్ మాత్రం ఆఫీసుకు వచ్చి చేయాలన్నాడు. మరి ఎలా తీసుకుంటారంటే.. మీ గురించి ఓ వంద వర్డ్స్ తో పరిచయం చేసుకుని.. ఫుల్ స్టాక్ లో మీ ప్రతిభను చూపిస్తూ చేసిన రెండు, మూడు వర్కుల లింకులు పంపితే చాలు ఆయన డిసైడ్ చేసుకుంటాడట.
ఆశ్చర్యకరంగా సుదర్శన్ కామత్ ట్వీట్‌కు అన్నీ నిరుత్సాహకరమైన స్పందనలో వస్తున్నాయి. క్రాక్డ్ ఫుల్ స్టాక్ ఇంజినీర్ అని పేరు పెట్టుకుని.. నలభై లక్షల జీతం ఇస్తానంటే ఎవరు వస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
Lol, not a single cracked engineer who are actually good at their stuff will work for such less salary. ESOPs are worthless untill something good happens and it’s not LPA, it’s just lacs.
— aryaan ✨ (@theRichieMagnum) February 24, 2025
ఇందిరానగర్ ఏరియాలో సుదర్శన్ ఆఫర్ చేస్తున్న జీతం తక్కువ అని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.
Indira Nagar is such an expensive place that out of 15 lacs where in hand will be 1 lac approx, 35k will go just in accommodation in a sharing apartment plus groceries plus weekends plus education loan EMI or discretionary spending EMI. Feel yourself lucky if you can save 20k.
— Satvik Khare (@satvikkhare31) February 24, 2025
ఇప్పుడంతా ఏఐ కాలం. అనేక మంది యువత ఇంజినీర్లు.. కొత్తగా స్టార్టప్‌లు ప్రారంభిస్తున్నారు. దాదాపుగా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ రంగంలో ప్రతిభ చూపించేవారికి జీతాలు ఎంత ఇవ్వడానికైనా మల్టీనేషనల్ కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి. అలాంటి టాలెంట్ ను అందిపుచ్చుకోవడంలో ఆయా కంపెనీలు కొన్ని రూల్స్ పెట్టుకుంటాయి. అయితే ఇలాంటి రూల్స్ ను బ్రేక్ చేసి అత్యుత్తమ టాలెంట్ ను అందిపుచ్చుకోవడానికి సుదర్శన్ కామత్ తన ప్రయత్నాలను చేస్తున్నారు.
మరిన్ని చూడండి